Lunar Eclipse 2022: ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 16న ఏర్పడనుంది. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. యాధృచ్చికంగాఇదే రోజున బుద్ధ పూర్ణిమ కూడా కావడం విశేషం. చంద్రగ్రహణం, బుద్ద పూర్ణిమ రెండూ పరిఘ యోగలో ఏర్పడుతున్నాయి. 80 ఏళ్ల తర్వాత ఇలాంటి గ్రహాలు, రాశుల కలయిక జరగబోతోందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇది కొన్ని రాశుల వారిపై చెడు ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
చంద్రగ్రహణం సమయంలో ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి :
కర్కాటకం- కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం మంచిదని చెప్పలేము. ఈ సమయంలో వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం పట్ల, కెరీర్ పట్ల జాగ్రత్త వహించాలి. ఈ సమయంలో మీ ఖర్చులు పెరుగుతాయి. అన్ని పనుల్లో ఓపికతో వ్యవహరించడం మంచిది.
తుల రాశి- చంద్రగ్రహణం తుల రాశి వారిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది, కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలి. అత్యుత్సాహం పనికిరాదు. మూఢనమ్మకాలతో ఎవరినీ నమ్మి మోసపోవద్దు. మతోన్మాదం, అహంకారపూరిత ధోరణి మానుకోండి. లేనిపక్షంలో వివాదాలు తలెత్తవచ్చు.
ధనుస్సు- ఈ చంద్రగ్రహణం ధనుస్సు రాశి వారికి కష్టాలను తీసుకొస్తుంది. మీరు చట్టపరమైన సమస్యల్లో చిక్కుకోవచ్చు. ఇప్పటికే ఎదుర్కొంటున్న కేసుల్లో సమస్యలు పెరుగుతాయి. ఆఫీసు పనిలో జాగ్రత్తగా ఉండండి. ఏ విషయమైనా ఆచీ తూచీ మాట్లాడాలి. ఒత్తిడి, ఆర్థిక నష్టం నుంచి బయటపడేందుకు ధ్యానం మంచి మార్గం.
Also Read: Andrew Symonds Death: లెజెండరీ ఆల్‌రౌండర్ సైమండ్స్ టాప్ 5 బెస్ట్ మూమెంట్స్ ఇవే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.