Fire in Kitchen Video: తొలిసారి వంట చేస్తున్నారా, జాగ్రత్త.. లేకపోతే ఇలా ప్రమాదాలు ఎదురౌతాయి

Fire in Kitchen Video: కుకింగ్ అనేది ఓ కళ. అందరికీ రానేరాదు. మీరు తొలిసారి కుకింగ్ కోసం కిచెన్‌లో ఎంట్రీ ఇస్తుంటే మాత్రం ఈ వీడియా తప్పకుండా చూడాల్సిందే. లేకపోతే ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 15, 2022, 08:12 PM IST
Fire in Kitchen Video: తొలిసారి వంట చేస్తున్నారా, జాగ్రత్త.. లేకపోతే ఇలా ప్రమాదాలు ఎదురౌతాయి

Fire in Kitchen Video: కుకింగ్ అనేది ఓ కళ. అందరికీ రానేరాదు. మీరు తొలిసారి కుకింగ్ కోసం కిచెన్‌లో ఎంట్రీ ఇస్తుంటే మాత్రం ఈ వీడియా తప్పకుండా చూడాల్సిందే. లేకపోతే ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు.

వీడియోలో కన్పిస్తున్న ఈ మహిళ తొలిసారి వంట చేసేందుకు కిచెన్‌లో వెళ్లింది. సోషల్ మీడియా స్టార్ కదా..అంతా కెమేరాలో కన్పించాలనుకుంది. కెమేరాపై పెడుతున్న ధ్యాస...కిచెన్‌లో పెట్టలేనట్టుంది. పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. భారీగా అంటుకున్న మంటల్నించి కాపాడమంటూ కేకలు వేసింది. అసలేం జరిగిందంటే..

వంట చేయడమనేది అంత సులభమేం కాదు. వంట చేసేవారికే కిచెన్‌లో ఎదురయ్యే సమస్యలు తెలుస్తాయి. చాలా సందర్భాల్లో వంటచేస్తు ప్రమాదాలకు గురై..మరణిస్తుంటారు. కొన్నిసార్లు గాయాలపాలవుతుంటారు. ఇటీవల వైరల్ అవుతున్న ఓ వీడియో అటువంటిదే. ఈ వీడియోలో ఓ మహిళ తొలిసారి కిచెన్‌లో ఎంట్రీ ఇచ్చింది. కిచెన్‌లో ఆమెకు ఎదురైన ప్రమాదం చూస్తే భయపడిపోతారు.

మంటల్నించి తృటిలో తప్పుకున్న సోషల్ మీడియా స్టార్

కిచెన్‌లో ఉన్నప్పుడు ఎప్పుడూ అప్రమత్తత చాలా అవసరం. అటువంటిది తొలిసారి కిచెన్ ఎంట్రీ ఇస్తుంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈ మహిళైతే తొలిసారి కిచెన్‌లో ప్రవేశించింది. ఈ సందర్భంగా పెను ప్రమాదమే జరిగింది. అదృష్ఠవశాత్తూ తృటిలో తప్పించుకుంది. వీడియోలో ఇదంతా స్పష్టంగా చూడవచ్చు. వంట వండుతుండగా ఒక్కసారిగా మంటలు అలముకున్నాయి. సోషల్ మీడియాలో స్టార్ కావడంతో తన తొలి కిచెన్ అనుభవాన్ని షేర్ చేసుకునేందుకు వీడియో తీస్తోంది.

ఈ మహిళ పేరు కెల్లీ కెరోన్. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటోంది. సోషల్ మీడియాలో కెల్లీ వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. తొలిసారి కిచెన్ అనుభవాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలనుకుంది. కానీ అంతలోనే ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదాన్ని వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. కిచెన్‌లో నలువైపులా పొగ అలముకుంది. అంతలో వంట వండుతున్న పాన్ నుంచి మంటలు వస్తాయి. దాంతో పాన్‌ను వాష్ బేసిన్ వద్దకు తీసుకొస్తుంది. అక్కడ మంటలు ఇంకా పెరిగిపోతాయి. దాంతో భయపడిపోయి..హెల్ప్ హెల్ప్ అంటూ కేకలు పెడుతుంది. ఏ మాత్రం ఆలస్యమైనా మంటల్లో చిక్కుకునేదే. అదృష్టం బాగుండి తృటిలో తప్పించుకుంది. 

అందుకే మీరెప్పుడైనా కిచెన్‌లో వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. నూనె వంటి వస్తువులు చుట్టుపక్కల లేకుండా..పడి ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మంటలు రేగితే ప్రమాద తీవ్రత పెరిగిపోతుంది. 

Also read: Snake & Girl Video: పాముతో చెలగాటాలాడితే...ఈ అమ్మాయికి ఎదురైన పరిస్థితే ఉంటుంది జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News