Cholesterol control Food: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది శరీరంలో కొవ్వు పెరగి అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా కొలెస్ట్రాల్ పెరుగుదల సమస్యలు పెరిగిపోతున్నాయి. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి మార్కెట్లో చాలా మందులు అందుబాటులో ఉన్నప్పటికీ..కొంతమంది దీనిని సహజంగా నియంత్రించాలనుకుంటున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అటువంటి పరిస్థితిలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం చాలా ముఖ్యం. కాబట్టి కొలెస్ట్రాల్ సమతుల్యంగా ఉండలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇలా కొలెస్ట్రాల్‌ను నియంత్రించండి:
కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఆహారంలో వాల్నట్లు, పొద్దుతిరుగుడు గింజలు, బాదం, ఆవాలు వంటి గింజలను ఆహారంగా తీసుకోవాలి. అంతే కాకుండా తృణధాన్యాల ద్వారా కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కనుక ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతే కాకుండా పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి ప్రయోజనాలు చేకూరుతాయి.
కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది?
వాస్తవానికి కల్తీ ఆహారం, జంక్ ఫుడ్, పానీయాలను క్రమంగా తినడం, తాగడం వల్ల లేదా వ్యాయామం చేయనప్పుడు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో జీవనశైలిని మార్చుకోని, ఆహార విషయంలో జాగ్రత్త వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Watermelon Benefits: పుచ్చకాయ తినే వారు తప్పకుండా ఈ విషయాలను తెలుసుకొండి..!!
Also Read: Vastu Tips For Broom: రాత్రి పూట చిపురుతో ఊడ్చుతున్నారా.. అయితే మీరు ఖచ్చితంగా ఇవి తెలుసుకోండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook