Minister Harish Rao:పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఇన్ని రోజులు ప్రజలపై భారం మోపి..ఇప్పుడు తుతూమంత్రంగా ధరలు తగ్గించారని మండిపడుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్‌రావు నిప్పులు చెరిగారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత తగ్గించారని ప్రశ్నించారు.
పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పెంచింది బారన, తగ్గించింది చారణ అని మండిపడ్డారు.పెట్రోల్, డీజిల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పన్ను పెంచలేదని స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర ధరలన్నీ పెరిగాయన్నారు. రూ.400 ఉండే గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు వెయ్యికిపైగా ఉందని చెప్పారు. గ్యాస్ సిలిండర్ ధర రూ. 600 పెంచి రూ.200 తగ్గించడం ఏంటని ఫైర్ అయ్యారు. తగ్గించిన గ్యాస్ ధర అందరికీ వర్తించదన్నారు. ధరలు తగ్గించామని కేంద్రం చెప్పడం అంతా బోగస్ అని అన్నారు.
పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు ధరలు ఎలా ఉండేవో గుర్తు చేసుకోవాలన్నారు. కేసీఆర్ పాలన గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదని విమర్శించారు. ప్రజలపై భారం మోపకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు మేలు జరిగేలా చూసుకుంటున్నామన్నారు మంత్రి హరీష్‌రావు.
కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో రూ.13 కోట్ల విలువైన అత్యాధునిక ఎంఅర్‌ఐ మిషన్, రూ.9 కోట్ల విలువైన క్యాత్ ల్యాబ్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా గాంధీ ఆస్పత్రిలో అన్ని మౌలిక వసతలు కల్పిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని వసతులు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.దీనిపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏరపాటు చేస్తున్నామన్నారు.
Also read:KGF Chapter 2 Update: హోరెత్తిస్తున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 కలెక్షన్లు, కేజీఎఫ్ కధ రాసిందెవరో తెలుసా
Also read:Trs Mla Warning: పరకాలకు వస్తే చెప్పు దెబ్బలే! రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook