Shani Jayanti 2022: జ్యోతిషశాస్త్రంలోని 9 గ్రహాల్లో ప్రతీదానికి తమదైన ప్రాముఖ్యత ఉంది. శని గ్రహం విషయానికొస్తే... శని దేవుడిని న్యాయ దేవుడిగా భావిస్తారు. వ్యక్తులు చేసే పాప, పుణ్య కార్యాలకు తగిన కర్మ ఫలాలను శని దేవుడు నిర్దేశిస్తాడు. పరమశివుడి అనుగ్రహం మేరకు శని దేవుడు ఈ వరాన్ని పొందాడు. అందుకే శని ఆగ్రహానికి గురికావొద్దని మనుషులే కాదు.. దేవతలు భయపడుతారు. శని దేవుడు ఆగ్రహిస్తే కష్టాల కడలి వెంటాడే ప్రమాదం ఉంటుంది. అదే సమయంలో శని దేవుడి అనుగ్రహం పొందేందుకు... శని దోష పరిహారానికి జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని చిట్కాలు సూచించబడ్డాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు పాటించాల్సిన నియమాలు :
తప్పుడు పనులు చేసేవారు వెంటనే వాటిని మానుకోండి. తప్పుడు మార్గంలో పయనించేవారు శని ఆగ్రహానికి గురికాక తప్పదు.
అబద్ధాలు చెప్పేవారిని శని దేవుడు ఎప్పుడూ క్షమించడు. కాబట్టి అబద్ధాలు చెప్పడం మానేయండి.
పేదవారితో ఎప్పుడూ అనుచితంగా, అమర్యాదగా ప్రవర్తించవద్దు. ఎవరితోనూ కయ్యాలు పెట్టుకోవద్దు. వ్యక్తిగత దూషణకు దిగవద్దు.
- ఇంటికి వచ్చిన అతిథిని దేవుళ్లలా గౌరవించాలి.
ఇంట్లోని స్త్రీలను ఎప్పుడూ అవమానించవద్దు. జీవిత భాగస్వామికి తగిన గౌరవం ఇవ్వాలి.
మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలి. మద్యం అలవాటు శని దేవుడికి ఆగ్రహం తెప్పిస్తుంది.
అనైతిక పనులు చేయడం మానుకోండి. ఒక వ్యక్తి అనైతిక చర్యలకు పాల్పడినట్లయితే శని దేవుడు వారికి అశుభాలు కలగజేస్తాడు.
ఎవరి ప్రయోజనం లేదా హాని కోసం కూడా తప్పుడు సాక్ష్యం ఇవ్వవద్దు. ఇలా చేసేవారిని శని దేవుడు క్షమించడు.
కష్టపడి పనిచేసేవారిని ఎప్పుడూ హేళన చేయవద్దు. వారి కష్టానికి తగిన గుర్తింపునివ్వాలి. వారితో మర్యాదగా వ్యవహరించాలి.
శని దేవుని అనుగ్రహం పొందడానికి శని జయంతి రోజున శని దేవుడిని పూజించాలి. ఆవాల నూనె, నల్ల నువ్వులు శని దేవుడికి సమర్పించాలి. వీలైతే పేదలకు దాన ధర్మాలు చేయాలి.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook