TS Inter Board: ఇంటర్ స్థాయిలో కొన్ని సబ్జెక్టులను తొలగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ఇంటర్ బోర్డు ఖండించింది. ఇంటర్లో పొలిటికల్ సైన్స్‌ను తొలగించడం లేదని స్పష్టం చేసింది. సీఈసీ(CEC),హెచ్ఈసీ(HEC) గ్రూప్‌ల్లో సివిక్స్ అందిస్తున్నారు. సమాజ అవసరాలను బట్టి కొత్త కోర్సులను తీసుకొస్తున్నామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో ఏ సబ్జెక్ట్‌ను తొలగించడం లేదని పేర్కొంది.
పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ తొలగించే ప్రతిపాదన ఏ స్థాయిలోనూ జరగలేదని తేల్చి చెప్పింది. ఇలాంటి వదంతులను నమ్మ వద్దని ఇంటర్ బోర్డు తెలిపింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మరింత నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఇంటర్మీడియట్ విద్యా శాఖ కార్యదర్శి చెప్పారు. ఆరోగ్యకరమైన విద్యా వాతావరణానికి భంగం కలిగించేందుకు కొందరూ అసత్య ప్రచారం చేస్తున్నారని ..ఇలాంటివి నమ్మవద్దని సూచించారు.
Also read:Name Astrology: ఈ 4 అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులు రాజులా జీవితాన్ని గడుపుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook