Road Roller Symbol: ఎన్నికల గుర్తుల కేటాయింపు విషయంలో టీఆర్ఎస్కి ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. కారు గుర్తును పోలి ఉన్న రోడ్ రోలర్ గుర్తును ఎవ్వరికీ కేటాయించవద్దని టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలకు ఎన్నికల కమిషన్ చెక్ పెట్టింది.
TRS to BRS Party Name Change: టీ.ఆర్.ఎస్ పార్టీ నుంచి బీ.ఆర్.ఎస్ పార్టీగా పేరు మార్చుకున్న సమాచారాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కి తెలియజేస్తూ టీఆర్ఎస్ కీలక నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ రెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఉన్నతాధికారులను కలిశారు.
Telangana BJP: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.త్వరలో మునుగోడు ఉప ఎన్నిక జరగనుండటంతో తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం జరిగింది.తెలంగాణ బీజేపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది.
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలు జరగాల్సిన 57 స్థానాల్లో దాదాపుగా 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 15 రాష్ట్రాల్లో 41 మంది అభ్యర్థులకు ఎలాంటి పోటీ లేకపోవడంతో వారినే విజయం వరించింది. నామినేషన్ల ఉపసంహరణకు నిన్నటితో గడువు ముగియడంతో ఏకగ్రీవమైన స్థానాలను సీఈసీ ప్రకటించింది.
బాలీవుడ్ యువ నటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) అనుమానస్పద మృతి నాటినుంచి మహారాష్ట్ర, బీహార్ ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం (CEC) బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ముఖ్యమైన తేదీలను వెల్లడించిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ అరోరా. ఫిబ్రవరి 8న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించి.. పిబ్రవరి 11న ఫలితాలు వెల్లడించనున్నట్టు ప్రకటించిన సీఇసీ. జనవరి 14న ఢిల్లీ ఎన్నికలపై నోటిఫికేషన్ వెలువడనుండగా.. జనవరి 21న నామినేషన్స్ దాఖలుకు తుది గడువు విధించినట్టు సీఈసి స్పష్టంచేసింది. జనవరి 22న నామినేషన్స్ పరిశీలన చేపట్టనుండగా జనవరి 24న నామినేషన్స్ ఉపసంహరణకు ఆఖరి గడువు విధించారు.
రాహుల్ గాంధీ 'రేప్ ఇన్ ఇండియా' వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించిన సమగ్ర నివేదికను సమర్పించాలని ఝార్ఖండ్ ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.