Indian Box Office: రికార్డు స్థాయి కలెక్షన్లతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్.. ఈ ఏడాది కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉన్నాయంటే..

Indian Box Office Collections 2022: కరోనాతో రెండేళ్ల పాటు డీలా పడ్డ ఇండియన్ బాక్సాఫీస్‌కు 2022 బిగ్ బూస్టింగ్ ఇస్తోంది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లు నమోదవుతున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 5, 2022, 10:20 AM IST
  • ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లు
  • తొలి 4 నెలల్లోనే రూ.4000 కోట్ల మార్క్
  • ఈ ఏడాది రూ.12 వేల కోట్ల మార్క్‌ను తాకే అవకాశం
Indian Box Office: రికార్డు స్థాయి కలెక్షన్లతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్.. ఈ ఏడాది కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉన్నాయంటే..

Indian Box Office Collections 2022: కరోనా కారణంగా రెండేళ్ల పాటు సినీ ఇండస్ట్రీకి గట్టి దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. 2020, 2021 సంవత్సరాల్లో సినీ ఇండస్ట్రీ భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. అయితే ప్రస్తుత 2022లో సినీ ఇండస్ట్రీకి కాసుల పంట పండుతోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లు కురుస్తున్నాయి. ఈ ఏడాది ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ఆదాయం రూ.12,515 కోట్లకు చేరుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే 2019లో నమోదైన అత్యధిక వసూళ్ల రికార్డు బద్దలవడం ఖాయం. 2019లో ఇండియన్ బాక్సాఫీస్ ఆదాయం రూ.10,948 కోట్లు కాగా.. ఈ ఏడాది మరో రూ.1567 కోట్లు ఎక్కువ వసూలయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్, మీడియా ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ గ్రూప్ఎం సంయుక్త నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఓర్మాక్స్-గ్రూప్ఎం నివేదిక ప్రకారం... ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లు నమోదయ్యాయి. ఈ 4 నెలల కాలంలోనే దాదాపు రూ.4,002 కోట్లు వసూలయ్యాయి. ఇది ఆల్ టైమ్ రికార్డుగా చెబుతున్నారు. 2019లో సగటున ఒక నెలకు బాక్సాఫీస్ ఆదాయం రూ.3,550 కాగా.. ఇప్పుడది రూ.1000 కోట్లు దాటడం విశేషం. నిజానికి ఈ ఏడాది జనవరిలో కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడటం, కొన్ని సినిమాలు వాయిదా పడటం జరిగినప్పటికీ... ఈ 4 నెలల్లో రికార్డు స్థాయి కలెక్షన్లు వచ్చాయి. 

ఇప్పటికీ దేశంలో 18 శాతం థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. ఏప్రిల్ నాటికి థియేటర్లలో సీట్ల సామర్థ్యం 82 శాతం మాత్రంగానే ఉంది. ప్రస్తుత జూన్‌లో అది 90 శాతానికి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. తద్వారా జూన్ నుంచి బాక్సాఫీస్ ఆదాయం మరింత పుంజుకునే అవకాశం ఉన్నట్లు అంచనాలు నెలకొన్నాయి.

దుమ్ము రేపుతున్న సౌత్ సినిమాలు :

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాలు రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబడుతున్నాయి. గడిచిన మూడేళ్లలో తెలుగు సినిమాల కలెక్షన్లు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్‌లో హిందీ బాక్సాఫీస్‌కు వచ్చిన ఆదాయంలో 60 శాతం సౌత్ డబ్బింగ్ సినిమాల నుంచే రావడం గమనార్హం. 2019లో ఇండియన్ బాక్సాఫీస్‌లో తెలుగు సినిమాల వాటా 12 శాతం కాగా.. ఈ ఏడాది కేవలం 4 నెలల్లోనే అది 27 శాతానికి చేరింది.ఈ ఏడాది బ్లాక్ బ్లస్టర్స్‌గా నిలిచిన కేజీఎఫ్ చాప్టర్ 2 బాక్సాఫీస్ వద్ద రూ.1,008 కోట్లు వసూలు చేయగా... ఆర్ఆర్ఆర్ రూ.875 కోట్లు, కశ్మీర్ ఫైల్స్ రూ.293 కోట్లు, బీస్ట్ రూ.169 కోట్లు, గంగూభాయి కతియావాడి రూ.153 కోట్లు వసూలు చేశాయి. 

Also Read: Jubilee Hills Gang Rape: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్ రేప్ కేసులో వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు...

Also Read: Hyderabad Minor Girl Gang Rape: దుబాయ్ చెక్కేసిన ఎమ్మెల్యే కొడుకు? గ్యాంగ్ రేప్ కేసును నీరుగార్చేపనిలో బడా నేత?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News