Railway Luggage Rules: మీరు తరచూ రైల్వే ప్రయాణం చేసేవారైతే..ఈ న్యూస్ మీ కోసమే. భారతీయ రైల్వే లగేజ్ పాలసీలో మార్పులు చేసింది. ఆ కొత్త నిబంధనలేంటో తెలుసుకోండి. లేకపోతే భారీగా జరిమానా తప్పదు మరి..
రైల్వే ప్రయాణీకులు తెలుసుకోవల్సిన అప్డేట్ ఇది. లగేజ్ పాలసీకు సంబంధించి నిబంధనలు మార్చినట్టుగా గత కొద్దికాలంగా వస్తున్న వార్తల్ని రైల్వే ఖండించింది. ఇవన్నీ పుకార్లుగా స్పష్టం చేసింది. రైల్వే ప్రయాణీకులు ఇటువంటి వార్తల్ని నమ్మవద్దని సలహా ఇస్తోంది. రైల్వే లగేజ్ పాలసీ అనేది పదేళ్ల పాతదని..దాని ప్రకారం రైల్వే ప్రయాణీకులు సామాను తీసుకెళ్లవచ్చని స్పష్టం చేసింది. రైల్వే ప్రయాణీకులు ఏ విధమైన బుకింగ్ లేకుండా లగేజ్ తీసుకెళ్లినా జరిమానా ఉండదని స్పష్టం చేసింది రైల్వే శాఖ.
రైల్వే లగేజ్ పాలసీలో మార్పులు వచ్చాయంటూ చాలాకాలంగా సోషల్ మీడియాతో పాటు డిజిటల్ న్యూస్ వేదికలపై వార్త ప్రచారమౌతోంది. నిర్ణీత బరువు కంటే ఎక్కువ లగేజి తీసుకెళితే జరిమానా విధిస్తారనేది ఆ వార్త. అయితే రైల్వైశాఖ ఈ వార్తను ఖండించింది.
రైల్వే శాఖ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికపై ఓ పోస్ట్ షేర్ చేసింది. ఇందులో వాస్తవమేంటో తెలిపింది. కొన్ని సోషల్ మీడియా వేదికలు, డిజిటల్ న్యూస్ ఛానెళ్లలో ఓ వార్త ప్రసారమౌతోందని తెలిపింది. కొద్దిరోజులుగా..లగేజ్ నియమాల్లో మార్పులు వచ్చాయని ప్రచారమౌతోంది. అయితే రైల్వే శాఖ ఏ విధమైన మార్పులు చేయలేదని..సర్క్యులర్ లేదా ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. పదేళ్ల నుంచి ఉన్న లగేజ్ నిబంధనలే అమల్లో ఉన్నాయని తెలిపింది.
భారతీయ రైల్వే నియమాల ప్రకారం విభిన్న కేటగరీల్లో రైల్వే ప్రయాణీకులు 40 కిలోల నుంచి 70 కిలోల వరకూ సామాను తీసుకెళ్లవచ్చు. అది కూడా తమతో పాటే కోచ్‌లో ఉంచుకోవచ్చు. ఇంతకంటే ఎక్కువైతే మాత్రం ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. నియమాల ప్రకారం స్లీపర్ క్లాస్‌లో 40 కిలోలు, టూటయర్లో 50 కిలోల వరకూ సామాను తీసుకెళ్లవచ్చు. అటు ఫస్ట్ క్లాస్ కేటగరీలో 70 కిలోల వరకూ కూడా లగేజ్ తీసుకెళ్లవచ్చు.
Also read: Pakistan Arms To Adilabad:ఆదిలాబాద్ కు పాకిస్తాన్ నుంచే ఆయుధాలు! ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook