Coronavirus: డీజీసీఐ కొత్త మార్గదర్శకాలు, విమానాశ్రయాల్లో నో మాస్క్..నో ఎంట్రీ

Coronavirus: కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసిరేందుకు సిద్ధమౌతోంది. దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో..కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. డీజీసీఐ కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 8, 2022, 06:24 PM IST
 Coronavirus: డీజీసీఐ కొత్త మార్గదర్శకాలు, విమానాశ్రయాల్లో నో మాస్క్..నో ఎంట్రీ

Coronavirus: కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసిరేందుకు సిద్ధమౌతోంది. దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో..కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. డీజీసీఐ కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. 

కరోనా సంక్రమణ క్రమంగా పెరుగుతోంది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ ఫోర్త్‌వేవ్ సంకేతాలు వెలువడుతున్నాయి. దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారు నాడు దేశవ్యాప్తంగా 3 వేల 714 కరోనా కొత్త కేసులు నమోదు కాగా, బుధవారం నాడు 5 వేల 233 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకూ 4 కోట్ల 31 లక్షల 90 వేల 282 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 28 వేల 857 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

మరోవైపు కోవిడ్ నిబంధనలు పాటించని ప్రయాణీకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఇటీవల హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పౌర విమానయాన శాఖను అలర్ట్ చేసింది. విమాన ప్రయాణీకులు ఇక నుంచి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని డీజీసీఐ కొత్త ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధరించకపోతే..బోర్డింగ్ వద్దే ప్రయాణీకుల్ని నిలిపివేయనున్నారు. మాస్క్ ధరిస్తేనే విమానాశ్రయంలో అనుమతి ఉంటుంది. 

Also read: దారుణం.. పబ్‌జీ ఆడొద్దన్నందుకు తల్లినే కాల్చి చంపిన 16 ఏళ్ల బాలుడు.. 2 రోజులు ఇంట్లోనే మృతదేహం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News