KL Rahul and Kuldeep Yadav ruled out of India vs South Africa T20I series: సొంత గడ్డపై భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడబోతోంది. గురువారం (జూన్ 9) నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం (జూన్ 9) రాత్రి 7 గంటలకు ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే టీ20 సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ గాయాల కారణంగా టోర్నీకి దూరమయ్యారు.
గాయంతో టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. తొలి టీ20 కోసం అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం సాయంత్రం రాహుల్ ప్రాక్టీస్ చేయగా.. అతడి గజ్జల్లో గాయం అయింది. గాయం గురించి రాహుల్ టీం మేనేజ్మెంట్కు తెలపగా.. ఇవాళ ఉదయమే గాయం తీవ్రతను వైద్యులు పరిశీలించారు. నొప్పి ఎక్కువగా ఉండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా అతడిని టీ20 సిరీస్ నుంచి బీసీసీఐ తప్పించింది.
కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ భారత జట్టును నడిపించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో రాహుల్‌కు బీసీసీఐ జట్టు పగ్గాలు అందించిన విషయం తెలిసిందే. ఇక హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా టీ20 సిరీస్ నుంచి వైదొలిగాడు. కుల్దీప్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాయం బారిన పడ్డాడు. గాయ, తీవ్రత ఎక్కువగా ఉండడంతో బీసీసీఐ అతడిని టీ20 జట్టు నుంచి తప్పించింది.
ఈ టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గాయం కారణంగా సీనియర్లు కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించారు. సెలక్షన్ కమిటీ ఈ ఇద్దరి స్థానంలో ఎవరిని ఎంపిక చేయలేదు. రాహుల్, కుల్దీప్ ఇప్పుడు ఎన్సీఏలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. అక్కడ వైద్య బృందం వారి గాయాలను అంచనా వేసి భవిష్యత్తు చికిత్సపై నిర్ణయం తీసుకుంటుంది.
KL Rahul has been ruled out of the T20I series against South Africa owing to a right groin injury while Kuldeep Yadav will miss out in the T20I series after getting hit on his right hand while batting in the nets last evening.
More details here - https://t.co/KDJwRE9tCz #INDvSA
— BCCI (@BCCI) June 8, 2022
భారత జట్టు:
రిషబ్ పంత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
Also Read: Mithali Raj Retires: మిథాలీ రాజ్.. మీరు చాలా మందికి రోల్ మోడల్! గొప్ప వారసత్వాన్ని మిగిల్చారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి