Rahu venus conjuction : గ్రహాల కదలిక రాశిచక్రంలోని అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం రాహువు కృత్తిక నక్షత్రంలో ఉన్నాడు. జూన్ 14న రాహువు కృత్తిక నుంచి భరణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 21, 2023 వరకు ఈ నక్షత్రంలోనే ఉంటాడు. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఆవిధంగా రాహువు-శుక్ర కలయిక ఏర్పడబోతోంది. రాహువుకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి.. రాహువు ఏ రాశిలోకి ప్రవేశిస్తాడో దాని అధిపతికి ఉండే స్వభావాలన్నీ పునికిపుచ్చుకుంటాడు. అంటే భరణి నక్షత్రంలోకి ప్రవేశిస్తే.. దాని అధిపతి శుక్రుడికి ఉండే స్వభావమే రాహువుకూ ఉంటుంది.
శుక్ర, రాహువుల ప్రభావం ఎలా ఉంటుందంటే.. :
శుక్రుడు, రాహువుల కలయిక రాశిచక్రంలోని రాశులపై బలమైన ప్రభావం చూపుతుంది. ఇది భౌతిక వాదానికి సంబంధించినది. శుక్రుడు అంటే శుక్రాచార్యుడు. ఆర్థిక శ్రేయస్సు, సుఖ సంతోషాలు, విలాసాలన్నీ శుక్రుడి అనుగ్రహంతోనే కలుగుతాయి. ఎప్పుడైతే రాహువు భరణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడో.. ఈ స్వభావం రాహువుకు కూడా వస్తుంది. ఒకరకంగా రాశి మార్పు కారణంగా శుక్రుడి శక్తిని రాహువు పొందుతాడు. రాహు-శుక్ర కలయిక గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నవారికి బాగా కలిసొస్తుంది. రాహువు-శుక్ర కలయిక ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలనిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
మేషం (Aries) : మేషం, లగ్న రాశి వారికి శుక్రుడు ప్రతికూలం. ఈ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే భరణి నక్షత్రంలో రాహువు శుక్ర కలయిక మేష రాశివారికి కలిసొస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనులు జరుగుతాయి. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే నేతలకు మంచి ఫలితాలు ఉంటాయి. ఐశ్వర్యంతో పాటు అనుకోని రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం మొదలైన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. అతిగా తినడం మంచిది కాదు.
వృషభ (Taurus) : విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఎగుమతి, దిగుమతి వ్యాపారం చేసేవారికి మేలు జరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి, సవాళ్లు కూడా పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో విజయం ఖాయం. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించేవారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారు బదిలీ అయ్యే అవకాశం ఉంది. పాత ఇంటిని విక్రయించే ప్రయత్నం చేస్తారు. డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
మిథునం (Gemini) : మిథున రాశివారికి ఖర్చులు పెరుగుతాయి. ప్లాట్లు, ఇళ్ల రూపంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతారు. తద్వారా మంచి లాభాలను పొందుతారు. ఫైనాన్స్, ప్రాపర్టీ, ఇన్సూరెన్స్ మొదలైన వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం మీకు కలిసొస్తుంది. రాహువు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు, కాబట్టి మీరు గుడ్డిగా పెట్టుబడి పెడితే నష్టాలు ఉండవచ్చు. మీ ముందు ఉండే నాలుగు తలుపుల్లో ఒక తలుపు మాత్రమే అదృష్టాన్ని తీసుకొస్తుంది. మిగతా మూడు తలుపులు హానికి సంకేతం. కాబట్టి జాగ్రత్తగా అడుగేయండి.
కర్కాటకం (Cancer) : కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఇల్లు, వాహనం వంటివి కొనాలనుకుంటే.. సెకండ్ హ్యాండ్‌వి తీసుకోవడం సముచితం. మీ స్నేహితుడి ద్వారానే ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కష్టపడి పనిచేయడం వల్లనే లాభం ఉంటుంది. ఉద్యోగం చేసే వారు యజమానికి విధేయత చూపాలి. అప్పుడు మాత్రమే వారికి గౌరవం లభిస్తుంది. ఆఫీసులో సిబ్బంది సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ రాశికి చెందిన భార్యాభర్తల వైవాహిక దాంపత్యం సాఫీగా సాగుతుంది.
సింహ రాశి (Leo) : సింహ రాశి వారు అనుకోని ప్రయాణాలు చేస్తారు. డిజిటల్ మీడియా రంగంలో ఉన్నవారికి కలిసొస్తుంది. సోషల్ మీడియా, జర్నలిజం, రచనా రంగంలో సరికొత్త అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్తే ఎక్కువ రోజులు ఉండాల్సి రావొచ్చు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. కాబట్టి ముందు నుంచే అప్రమత్తంగా ఉండాలి.
కన్య (Virgo) : ఈ రాశి వారికి ఆకస్మిక ధన నష్టం రావొచ్చు. అనవసర ఖర్చులు, దుబారా పెరుగుతాయి. ఆరోగ్యం బాగోలేక వైద్య చికిత్సకు భారీగా డబ్బు వెచ్చిస్తారు. ఎక్కడికైనా షార్ట్ ట్రిప్స్ ప్లాన్ చేస్తారు. కుటుంబంతో కలిసి ఎక్కువ సమయం గడుపుతారు. అవివాహితులు పెళ్లి సంబంధాల వేటలో ఉంటారు. విద్యాపరమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది.
తుల రాశి (Libra) : వ్యాపారానికి అనుకూల సమయం. పరిచయాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రేమ వ్యవహారానికి అనుకూల సమయం. వివాహ విషయంపై కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు తగిన సమయం. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో మీరు తిరస్కరించిన ఆఫర్ మళ్లీ వెతుక్కుంటూ వస్తుంది.
వృశ్చికం (Scorpio) : ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతారు. ధన ప్రవాహం కొనసాగుతుంది. సంపాదన, ఖర్చులు ఒకే విధంగా ఉంటాయి. ప్రేమికుల మధ్య దంపతుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. శివ పూజతో సమస్యలు తొలగిపోతాయి. శివుడికి ఇష్టమైన నైవేద్యం పెట్టి పూజించాలి.
ధనుస్సు (Sagittarius) : చదువు పట్ల శ్రద్ధ పెట్టలేరు. తెలివితేటలు బాగానే ఉన్నా చదువుకోవాలనే భావన ఉండదు. ఉద్యోగస్తుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. మీ బాస్‌తో మళ్లీ మళ్లీ తిట్లు తింటారు. విద్యార్థులు, ఉద్యోగులు తమ పనిపై పూర్తి దృష్టి పెట్టాలి. వ్యాపారస్తులు బాగా సంపాదిస్తారు. ఉద్యోగంలో బదిలీ, పదోన్నతి ఉంటుంది. కోర్టు కేసులు గెలుస్తారు. పొట్టకు సంబంధించి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
మకరం (Capricorn) : లాభాలు కురుస్తాయి. పేదవారికి సహాయం చేయడం మర్చిపోకండి. ఇంట్లో అక్షం కంటే ఎక్కువ డబ్బు ఉంచడం ప్రాణాంతకం. పేదలకు సహాయం చేయడం ద్వారా మీరు పుణ్యం తీసుకోకపోతే ఏదైనా వ్యాధి సంక్రమిస్తుంది. జ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. రాహువు కొన్నిసార్లు భయాందోళనలను సృష్టిస్తుంది. ఎవరి ట్రాప్‌లో పడవద్దు. డబ్బు కోసం మిమ్మల్ని ట్రాప్ చేసే ప్రయత్నం జరగవచ్చు.
కుంభం (Aquarius) : చేసే పనిలో మార్పు ఉంటుంది. చేపట్టిన పని సగమే పూర్తవుతుంది. పనిని మధ్యలోనే వదిలేసే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు చేసే వారు నష్టాలను చవిచూస్తారు. సొంత ఇంట్లోనూ సంతృప్తికరంగా ఉండదు. మీరు ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడండి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి.
మీనం (Pisces) : పన్ను సంబంధిత విషయాలలో అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వ సంస్థల నుంచి నోటీసులు రావొచ్చు. కుటుంబంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరగవచ్చు. తమ్ముడు లేదా సోదరి ప్రేమ వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. మాటపై సంయమనం పాటించండి. స్త్రీలు, భార్యను గౌరవించాలి. స్త్రీలను అవమానిస్తే రాహువు ఆగ్రహిస్తాడని గుర్తుంచుకోండి.
(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Diabetes Control Tips: డయాబెటిస్ పేషెంట్స్ ఈ 4 రకాల కూరగాయలు అస్సలు తినకూడదు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook