Hyderabad Police: మైనర్లు బండి నడిపితే.. జైలుకు తల్లిదండ్రులు! వక్భ్ బోర్డు చైర్మెన్ ను అరెస్ట్ చేస్తారా..?

Hyderabad Police: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తూ ప్రమాదాలు చేస్తుండటంతో సీరియస్ యాక్షన్ కు దిగుతున్నారు. రోడ్డు భద్రతకు సంబంధించి కేంద్ర సర్కార్ తీసుకువచ్చిన మోటార్ వెహికల్ చట్టంతో పాటు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయబోతున్నారు.

Written by - Srisailam | Last Updated : Jun 9, 2022, 11:39 AM IST
  • మైనర్లు బండి నడిపితే తల్లిదండ్రులు జైలుకే!
  • డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తే లైసన్స్ రద్దు
  • హైదరాబాద్ లో ఎంవీ యాక్ట్ అమలు
Hyderabad Police: మైనర్లు బండి నడిపితే.. జైలుకు తల్లిదండ్రులు! వక్భ్ బోర్డు చైర్మెన్ ను అరెస్ట్ చేస్తారా..?

Hyderabad Police: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తూ ప్రమాదాలు చేస్తుండటంతో సీరియస్ యాక్షన్ కు దిగుతున్నారు. రోడ్డు భద్రతకు సంబంధించి కేంద్ర సర్కార్ తీసుకువచ్చిన మోటార్ వెహికల్ చట్టంతో పాటు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయబోతున్నారు. దీని ప్రకారం మద్యం తాగి బండి నడిపితే డ్రైవింగ్ లైసన్స్ రద్దవుతుంది.  బైకులు, ఆటోలు, కార్లు, బస్సులు, లారీలు... లిక్కర్ సేవించి ఏ వాహనం నడిపినా నేరమే. మద్యం తాగి డ్రైవింగ్ చేసి పోలీసులకు పట్టుబడితే.. మూడు నెలల పాటు వాళ్ల డ్రైవింగ్ లైసన్స్ క్యాన్సిల్ అవుతుంది.

డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వాళ్ల వివారలవను ట్రాఫిక్ పోలీసులు కోర్టుకు సమర్పిస్తారు. కోర్టు ద్వారానే  లైసెన్స్‌ రద్దు ఉత్తర్వులను రవాణాశాఖకు పంపించనున్నారు. ఇటీవల కాలంలో మద్యం మత్తులో ప్రమాదాలు పెరగడం వల్లే ట్రాఫిక్ పోలీసులు సీరియస్ యాక్షన్ కు దిగారని తెలుస్తోంది. అంతేకాదు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు పెంచాలని నిర్ణయించారని సమాచారం. ఎంవీ యాక్ట్ ప్రకారం మోతాదుకు మద్యం తాగి వాహనాలు నడిపితే చాలా కష్టాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ప్రతి కేసు కోర్టులో నమోదవుతుంది. పోలీసులకు చిక్కి జైలుకు వెళితే ఉద్యోగం ఊస్టింగే. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి డ్రంకన్ డ్రైవ్ కేసులు అవరోధంగా మారుతాయి. ముఖ్యంగా ఐటీ జాబ్ లు రావడం కష్టం. కేసులుంటే  విదేశాలకు వెళ్లడానికి అవకాశం ఉండదు.  

డ్రంకన్ డ్రైవ్ తో పాటు మైనర్లు బండి నడపకుండా చెక్ పెట్టడంపై హైదరాబాద్ పోలీసులు ఫోకస్ చేశారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే.. వారిపై కేసు నమోదు చేయడంతో మోటారు వాహన చట్టం ప్రకారం మైనర్లు తల్లిదండ్రులను జైలుకు పంపించనున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు నేరుగా పట్టుకోకపోయినా.. సీసీకెమెరాలకు చిక్కినా కేసులు నమోదు చేయనున్నారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ లో ఇటీవల కాలంలో మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేస్తున్నారు. సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులోనూ నిందితులుగా ఉన్న మైనర్లే బెంజ్, ఇన్నోవా కార్లను నడిపారు. మైనర్ బాలికను ఆ కార్లలోనూ తీసుకెళ్లారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మైనర్ బాలికను తీసుకెళ్లిన కార్లను నడిపిన మైనర్ల తల్లిదండ్రులను అరెస్ట్ చేయాలనే డిమాండ్ వస్తోంది. పోలీసుల తాజా నిర్ణయంతో బెంజ్, ఇన్నావో కార్లను డ్రైవ్ చేసిన నిందుతల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read also: YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలనం.. సాక్షి అనుమానాస్పద మృతి  

Read also: Gang Rape Case Update: పోలీస్ కస్టడీకి గ్యాంగ్ రేప్ కేసు నిందితుడు.. బడాబాబుల లింకులు బయటపడేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News