Ashadha Masam: ఆషాడం ప్రారంభం కానుంది, ఏ వ్రతాలు చేయాలి, ఏం పూజలు చేస్తే మంచిది

Ashadha Masam: హిందూమతం ప్రకారం పౌర్ణమి తరువాత కొత్త నెల ప్రారంభమౌతోంది. జూన్ 14న జ్యేష్టమాసపు పౌర్ణిమ తరువాత..జూన్ 15 నుంచి ఆషాఢ మాసం మొదలవుతోంది. ఈ నెలలో చేయాల్సిన వ్రతాలు, పూజల గురించి తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 14, 2022, 08:45 PM IST
Ashadha Masam: ఆషాడం ప్రారంభం కానుంది, ఏ వ్రతాలు చేయాలి, ఏం పూజలు చేస్తే మంచిది

Ashadha Masam: హిందూమతం ప్రకారం పౌర్ణమి తరువాత కొత్త నెల ప్రారంభమౌతోంది. జూన్ 14న జ్యేష్టమాసపు పౌర్ణిమ తరువాత..జూన్ 15 నుంచి ఆషాఢ మాసం మొదలవుతోంది. ఈ నెలలో చేయాల్సిన వ్రతాలు, పూజల గురించి తెలుసుకుందాం..

హిందూమతంలో నాలుగవ నెల ఆషాఢమాసం. జూన్ 15 నుంచి ప్రారంభం కానుంది. కొత్త నెల ప్రారంభమవుతూనే చేయాల్సిన వ్రతాలు, పూజల గురించి తెలుసుకుంటుంటారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఆషాఢమాసం జూలై 13 బుధవారం నాడు అంతమవుతుంది. ఈ నెలలో చాలా పెద్ద వ్రతాలు దేవశ్యాని ఏకాదశి, యోగిని ఏకాదశి, మిథున సంక్రాంతి, ప్రదోష వ్రతం, మాసిక శివరాత్రి, చతుర్ధి, జగన్నాథ యాత్ర వంటి పండుగలు కూడా ఉన్నాయి.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆషాఢం నెల విష్ణు భగవానుడి పూజ చేస్తారు. ఈ నెలలో శ్రీహరి పూజ చేయడం వల్ల విశేష ఫలాలు లభిస్తాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నెలలో వచ్చే..దేవశ్యాని ఏకాదశి నాడు విష్ణు భగవంతుడు యోగనిద్రలో వెళ్లనున్నారు. అప్పటి నుంచి చతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా అన్ని శుభకార్యాలు నిలిచిపోతాయి. ఎందుకంటే ఈ నాలుగు నెలల్లో దేవదేవుళ్లు నిద్రపోతారు. ఆషాఢమాసంలోని వ్రతాలు, పండుగల గురించి తెలుసుకుందాం..

ఆషాఢం 2022 వ్రతాలు, పండుగల జాబితా

జూన్ 15 బుధవారం మిథున సంక్రాంతి. ఆషాడ మాసంలోని తొలి తిధినాడే మిధున సంక్రాంతి ఉంటుంది. ఈ రోజు సూర్యుడు మిధునరాశిలో నెలరోజుల కోసం ప్రవేశిస్తాడు.

జూన్ 17 శుక్రవారం నాడు కృష్ణపక్షం సంకిష్ఠ చతుర్ధి ఉంది. ఈరోజున విధి విధానాలతో గణేషుని పూజిస్తారు.

జూన్ 20 సోమవారం నాడు కాళాష్టమి వ్రతం, మాసిక జన్మాష్టమి ఉంది. జూన్ 24వ తేదీ శుక్రవారం నాడు యోగినీ ఏకాదశి విష్ణు భగవానుడికి అంకితం. ఈ రోజున శ్రీ హరి పూజ చేస్తారు. 

జూన్ 26 ఆదివారం నాడు ప్రదోష వ్రతం భోళనాధునికి ఇష్టమైనది. ఈ రోజున వ్రతం ఆచరిస్తే భోళానాధుడు కటాక్షం లభిస్తుంది. జూన్ 27 సోమవారం నాడు మాసిక శివరాత్రి కూడా శివుడికి ప్రీతిపాత్రమైన రోజు.

జూన్ 29 బుధవారం ఆషాఢమాసం అమావాస్య రోజు. పిత్రులకు తర్పణం వంటివి ఇస్తారు. జూన్ 30 గురువారం నాడు గుప్త నవరాత్రి ప్రారంభం కానుంది. చంద్ర దర్శనముంటుంది. జూలై1 శుక్రవారం నాడు జగన్నాధ రథయాత్ర ఉంటుంది. 

జూలై 3వ తేదీ ఆదివారం నాడు వినాయక చతుర్ధి రోజున గణేశుడి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. వ్రతం ఆచరిస్తారు. జూలై 4వ తేదీ సోమవారం నాడు స్కంధ సష్టి రోజున కార్తికేయ భగవానుడిని పూజిస్తారు. జూలై 9వ తేదీ మంగళవారం నాడు గౌరీ వ్రతం ఉంటుంది. జూలై 10వ తేదీ ఆదివారం నాడు దేవశ్యాని ఏకాదశి, వాసుదేవ ద్వాదశి, చాతుర్మాస ప్రారంభం ఉంది. జూలై 11 సోమవారం నాడు సోమ ప్రదోష వ్రతం ఆచరిస్తారు. జూలై 12 మంగళవారం నాడు జయపార్వతి వ్రతం ఆచరిస్తారు. జూలై 13 బుధవారం నాడు గురు పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూజ ఉంటుంది. గురు పూర్ణిమ నాడు గురువులను పూజిస్తారు. ఆ రోజున వ్యాసుని పూజించడం ఓ ఆనవాయితీ. 

Also read: Zodiac Signs: ఈ రాశులవారికి డబ్బు కంటే ప్రేమే ఎక్కువ, అదే సర్వస్వం, మీ రాశి ఏంటి మరి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News