North Korea: కరోనా మహమ్మారి తరువాత ఇప్పుడు ఉత్తర కొరియాలో మరో ప్రాణాంతక వ్యాధి విస్తరిస్తోంది. ప్రజల్ని రక్షించేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ స్వయంగా రంగంలో దిగారు.
కరోనా వైరస్‌తో పోరాడుతున్న ఉత్తర కొరియాలో ఇప్పుడు కొత్తగా మరో సంక్రమిత వ్యాధి విస్తరిస్తోంది. ఉత్తర కొరియాలో ఇవాళ జ్వరం లక్షణాలతో 26 వేల 10 కేసులు వెలుగుచూశాయి. ఏప్రిల్ చివరినాటికి దేశంలో జ్వరంతో బాధపడతున్నవారి సంఖ్య 4.56 మిలియన్లకు చేరుకోవడం గమనార్హం. రోగుల్ని ఆదుకునేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుు కిమ్ జోంగ్ స్వయంగా రంగంలో దిగి..మందులు పంపించారు. ఉత్తర కొరియాలో విస్తరిస్తున్న ఈ కొత్త వ్యాధి ఏ మేరకు ప్రమాదకరమో తెలుసుకుందాం..
ఉత్తరకొరియాలోని హేజు నగరంలో కడుపుపై దాడి చేసే కొత్త వైరస్ బారిన పడిన రోగులకు కిమ్ జోంగ్ మందులు పంపించారు. కిమ్ జోంగ్ బుధవారం నాడు హేజులో ఎక్యూట్ ఎంటెరిక్ ఎపిడెమిక్ వ్యాధితో బాధపడుతున్న రోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దేశంలో గురువారం నాడు జ్వరం లక్షణాలతో బాధపడుతున్నవారి సంఖ్య 4.56 మిలియన్లకు చేరుకుంది. కరోనా వైరస్ నియంత్రణకు ఏ విధమైన చర్యలు చేపట్టారో అవన్నీ ఇప్పుడు చేస్తున్నారు. క్వారంటైన్‌తో పాటు అవసరమైన ఇతర పద్ధతుల్ని ఆశ్రయిస్తున్నారు.
జ్వర బాధితుల సంఖ్యను ప్రతిరోజూ ప్రకటిస్తున్నారు. కోవిడ్ 19 కేసుల్ని మాత్రం వెల్లడించడం లేదు. ఎందుకంటే దేశంలో కోవిడ్ టెస్టింగ్ కిట్ల కొరత ఉంది. మరోవైపు కరోనా వైరస్ కంటే ముందే ఉత్తర కొరియాలో టైఫాయిడ్ వంటి రోగాలు విస్తరించాయని తెలుస్తోంది. సియోల్‌లో హయాంగ్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రొఫెసర్ శిన్ యంగ్‌జీన్ చెప్పినదాని ప్రకారం..టైపాయిడ్, శిగెలోసిస్ వంటి వ్యాధులు ఉత్తర కొరియాలో కొత్తకాకపోయినా..సమస్యాత్మకమే. మరోవైపు ఇప్పుడు కొత్తగా జ్వరం వంటి లక్షణాలతో కొత్త వ్యాధి సంక్రమిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది.
Also read; Srilankan Airlines: గగనతలంలో పైలట్ల అప్రమత్తత.. తప్పిన పెనుప్రమాదం..!
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook