Agnipath Protests Effect: 'అగ్నిపథ్' అల్లర్ల ఎఫెక్ట్.. విశాఖపట్నం రైల్వే స్టేషన్ మూసివేత..

Vishakapatnam Railway Station Closed: 'అగ్నిపథ్' నిరసనల సెగ ఏపీని తాకింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగం రైల్వే అధికారులు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను మూసివేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 18, 2022, 08:28 AM IST
  • సికింద్రాబాద్ అల్లర్ల ఎఫెక్ట్
  • విశాఖపట్నం రైల్వే స్టేషన్ మూసివేత
  • ఈ మధ్యాహ్నం వరకు ఎవరిని అనుమతించమని చెప్పిన రైల్వే అధికారులు
Agnipath Protests Effect: 'అగ్నిపథ్' అల్లర్ల ఎఫెక్ట్.. విశాఖపట్నం రైల్వే స్టేషన్ మూసివేత..

Vishakapatnam Railway Station Closed: దేశమంతా అగ్నిపథ్ నిరసనలతో హోరెత్తుతోంది. ఔత్సాహిక ఆర్మీ అభ్యర్థులు అగ్నిపథ్ స్కీమ్‌ను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతున్నారు. మొదట ఉత్తర భారతంలో కనిపించిన నిరసనల సెగ.. ఆ తర్వాత దక్షిణాదికి విస్తరించింది. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకు దిగిన యువత విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. ఈ అల్లర్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్తగా ఏపీలోని విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను మూసివేశారు.

శనివారం (జూన్ 18) మధ్యాహ్నం 12గం. వరకు రైల్వే స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అప్పటివరకూ రైల్వే స్టేషన్‌లోకి ఎవరికీ అనుమతి ఉండదని చెప్పారు. రైల్వే స్టేషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ మూసివేసిన నేపథ్యంలో ఇక్కడికి రావాల్సిన పలు రైళ్లను దువ్వాడ, కొత్తవలస, అనాకపల్లి రైల్వే స్టేషన్లలోనే ఆగిపోయేలా చర్యలు తీసుకున్నారు. పలు రైళ్లను దారి మళ్లించనున్నారు.

దువ్వాడ రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయే రైళ్లు :

కాచిగూడ-విశాఖ ఎక్స్‌ప్రెస్
విశాఖ-గోదావరి ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్-విశాఖ గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్
లోకమాన్య తిలక్-విశాఖ ఎక్స్‌ప్రెస్
కడప-విశాఖ ఎక్స్‌ప్రెస్ 

అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో నిలిచిపోనున్న రైళ్లు :

తిరుపతి-విశాఖ డబుల్ డెక్కర్ 
మచిలీపట్నం-విశాఖ ఎక్స్‌ప్రెస్
కాకినాడ-విశాఖ ఎక్స్‌ప్రెస్

దిఘా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను కొత్త వలస రైల్వే స్టేషన్‌లో నిలిపివేయనున్నారు.
 

Also Read: Gold Price Today: పైపైకి పసిడి.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఏయే నగరాల్లో ఎంత ధర ఉందంటే..  

Also Read: Agnipath Protest: సికింద్రాబాద్ అల్లర్లపై నాన్‌బెయిలబుల్‌ కేసులు.. నిరసనకారులకు జీవితాంతం ఉద్యోగం లేనట్టే!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News