Jr NTR film with Vetrimaaran : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాతో వచ్చిన సక్సెస్ జోష్ లో ఉన్నారు. రామ్ చరణ్ తో కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' జూనియర్ ఎన్టీఆర్‌కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టిన సినిమాగా నిలిచింది. దీంతో ఇప్పుడు కేవలం తెలుగు వారే కాక అన్ని భాషల్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా గురించి ఇప్పుడు ఆయన అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఎగ్జయిట్ అయ్యే మరో కాంబో గురించి ఇప్పుడు వార్తలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఎన్టీఅర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా ఇంకా షూట్ వరకు వెళ్ళలేదు.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మోషన్ పోస్టర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ సినిమా ప్రకటన కూడా వెలువడింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలిసి చేసే సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రక్తంలో తడిసిన మట్టి మాత్రమే గుర్తుకు వస్తుంది అనే ట్యాగ్ లైన్‌తో సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ రావడంతో ఈ సినిమా మంచి మాస్ మసాలా సబ్జెక్ట్ అవుతుందని భావిస్తున్నారు.
ఇక మరోపక్క పవర్ ఫుల్ కథలతో తమిళ పరిశ్రమలో సందడి చేస్తున్న తమిళ దర్శకుడు వెట్రిమారన్ తో జూనియర్ ఎన్టీఆర్ జోడీ కడుతున్నారని వార్తలు వస్తున్నాయి. వెట్రిమారన్ చెప్పిన పాన్ ఇండియా సబ్జెక్ట్ కి జూనియర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఆయన చేసిన అసురన్ సినిమా తెలుగులో వెంకటేష్ దగ్గుబాటి మరియు ప్రియమణి నటించిన నారప్పగా రీమేక్ చేయబడింది. అలాగే మరికొన్ని సినిమాలు కూడా తమిళంలో బాగా ఆడడంతో ఆయనతో చేసే సినిమాతో వరుస హిట్స్ కొట్టడం ఖాయమని నందమూరి అభిమానులు భావిస్తున్నారు.
తమిళ సినీ దర్శకులు ఈ మధ్య ఎక్కువగా తెలుగు మీద ఫోకాస్ పెడుతున్నారు. ఇప్పటికే దర్శకుడు శంకర్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తున్నారు. అలాగే మరో దర్శకుడు లింగుసామి కూడా రామ్ పోతినేనితో ది వారియర్ అనే సినిమా చేస్తున్నారు. ఇప్పుడు యువ దర్శకుడు వెట్రిమారన్ తారక్‌తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దళపతి విజయ్‌తో సినిమా చేస్తున్న వంశీ పైడిపల్లి, ధనుష్ తో వెంకీ అట్లూరి, శివ కార్తికేయన్ తో అనుదీప్ తో సహా కొంతమంది తెలుగు దర్శకులు కూడా తమిళంలోకి అడుగు పెడుతున్నారు.
Also Read :Godfather: గాడ్ ఫాదర్లో అన్నాచెల్లెళ్లుగా చిరంజీవి, నయనతార.. లీక్ చేసిన తమన్...
Also Read : Sai Pallavi Explanation: మతం గురించి మాట్లాడలేదు.. భజరంగ్ దళ్ హెచ్చరికలకు సాయి పల్లవి సమాధానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook