Coal India Limited Jobs 2022: కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థలో మేనేజ్‌మెంట్ ట్రెయినీల భర్తీ కోసం ఉద్యోగ ప్రకటన వెలువడింది. గ్రాడ్యూయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్, గేట్ 2022 లో స్కోర్ ఆధారంగా ఈ రిక్రూట్‌మెంట్ జరగనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు కోల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 1050 మేనేజ్ మెంట్ ట్రెయినీ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
కోల్ ఇండియా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో గమనించాల్సిన ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి ప్రారంభ తేదీ : జూన్ 23, 2022 గురువారం ఉదయం 10 గంటలు నుండి
అప్లికేషన్ ఫారం సమర్పించేందుకు చివరి తేదీ : జూలై 22, 2022 రాత్రి 11.59 గంటలు వరకు.
పోస్టుల వివరాలు | మేనెజ్‌మెంట్ ట్రెయినీలు |
మొత్తం ఖాళీలు | 1050 |
విభాగాల వారీగా వేకెన్సీలు | మైనింగ్ - 699 |
సివిల్ - 160 | |
ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్ - 124 | |
సిస్టం అండ్ ఇడిపి - 67 |
మైనింగ్ / సివిల్ / బిఈ / ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ |
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బిటెక్, బిఎస్సీ (ఇంజనీరింగ్) 60 శాతం మార్కులతో ఉత్తీర్ణ |
సిస్టం అండ్ ఇడిపి | 60 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బిఈ / బిటెక్ / బిఎస్సీ / కంప్యూటర్ ఇంజనీరింగ్ / ఐటి లేదా ఎంసీఏ డిగ్రీ ఉండాలి |
జనరల్ / ఓబీసీ (క్రిమీలేయర్, నాన్-క్రిమీలేయర్) ఈడబ్లూఎస్ కేటగిరీ |
ఈ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కింద రూ. 1180 చెల్లించాల్సి ఉంటుంది. |
ఎస్సీ / ఎస్టీ / పీడబ్లూడీ / ఈఎస్ఎం అభ్యర్థులు / కోల్ ఇండియా సంస్థ ఉద్యోగులు | ఈకోవలకి వచ్చే వారు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు |
ఫీజు చెల్లించే విధానం | ఆన్‌లైన్ |
ఎంపిక ప్రక్రియ:
కోల్ ఇండియా సంస్థలో మేనేజ్ మెంట్ ట్రెయినీలుగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అవసరమైన అర్హతలు కలిగి ఉండటంతో పాటు తప్పనిసరిగా గ్రాడ్యూయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ పరీక్ష హాజరై ఉండాలి. వారి గేట్ స్కోర్ (GATE 2022 Score) ఆధారంగా మెరిట్ మార్కులు కలిగిన అభ్యర్థులను ఆయా విభాగాల్లోకి ఎంపిక చేయడం జరుగుతుందని కోల్ ఇండియా లిమిటెడ్ స్పష్టంచేసింది.
Also read : Govt Jobs 2022 News: తెలంగాణలోని యూనివర్శిటీలలో ఖాళీల భర్తీ కోసం కామన్ బోర్డ్ ఏర్పాటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.