Best Smartphones: బెస్ట్ డిజైన్, ఫీచర్లతో 5 వేలకంటే తక్కువకే మార్కెట్‌లో లభించే స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Best Smartphones: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా..బడ్జెట్ తక్కువైనా చింతించాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఫీచర్లతో 5 వేల కంటే తక్కువకే లభ్యమౌతోంది. డిజైన్, ఫీచర్లు మరే ఇతర ఫోన్‌తో తక్కువేం కాదు. ఆ వివరాలివీ..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 24, 2022, 03:33 PM IST
Best Smartphones: బెస్ట్ డిజైన్, ఫీచర్లతో 5 వేలకంటే తక్కువకే మార్కెట్‌లో లభించే స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Best Smartphones: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా..బడ్జెట్ తక్కువైనా చింతించాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఫీచర్లతో 5 వేల కంటే తక్కువకే లభ్యమౌతోంది. డిజైన్, ఫీచర్లు మరే ఇతర ఫోన్‌తో తక్కువేం కాదు. ఆ వివరాలివీ..

ఒకవేళ మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనే ప్లానింగ్ చేస్తుంటే ఇదే మంచి అవకాశం. మీ బడ్జెట్ 5 వేల రూపాయలున్నా ఫరవాలేదు. మార్కెట్‌లో ప్రస్తుతం తక్కువ బడ్జెట్‌కే లభ్యమౌతున్నాయి. మంచి డిజైన్, అద్భుతమైన ఫీచర్లతో ఉన్నాయి. 5 వేల కంటే తక్కువకే లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..

రిలయన్స్ జియో ఫోన్ నెక్స్ట్

రిలయన్స్ జియో ఫోన్ నెక్స్ట్ ఇప్పుడు కేవలం 4 వేల 499 రూపాయలకే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో చాలా ఫీచర్లున్నాయి. ఇందులో 5.45 ఇంచెస్ డిస్‌ప్లే, 13 మెగాపిక్సెల్ రేర్ కెమేరా ఉంది. అటు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉన్న ఈ ఫోన్..మార్కెట్‌లో ఇతర ఫోన్లతో పోటీ పడుతోంది. ఇందులో 2 జీబీ ర్యామ్, పవర్‌ఫుల్ ప్రోసెసర్ కూడా ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎం01 కోర్

ఈ స్మార్ట్‌ఫోన్ 5 వేలకంటే తక్కువకే లభిస్తోంది. మార్కెట్‌లో ఈ ఫోన్ ధర 4 వేల 999 రూపాయలు. ఇందులో 3500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పాటు 5.3 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే, 1 జిబి ర్యామ్ ఉన్నాయి. మరోవైపు 16 జీబీ రోమ్ సామర్ద్యం మరో ప్రత్యేకత. ఫోన్ కాస్త స్లోగా ఉన్నా..మిగిలిన ఫీచర్ల వరకూ ఈ బడ్జెట్‌లో బెస్ట్ ఫోన్‌గా చెప్పుకోవచ్చు.

లావా జెడ్41

ఈ ఫోన్ మీకు కేవలం 4 వేల 749 రూపాయలకే లభిస్తోంది. అద్భుతమైన ఫీచర్లు, సొగసైన డిజైన్ ఈ ఫోన్ సొంతం. 5 మెగాపిక్సెల్ రేర్ కెమేరా, 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా ఉన్నాయి. ఇక బ్యాటరీ సామర్ధ్యం 2500 ఎంఏహెచ్ కలిగి ఉండి 5 ఇంచెస్ డిస్‌‌ప్లేతో వస్తోంది. 

ఐటెల్ ఏ23 ప్రో

ఈ స్మార్ట్‌ఫోన్ 5 వేలకంటే తక్కువకే లభించనుంది. ఇందులో పవర్ బ్యాకప్ 2400 ఎంఏహెచ్ ఉంది. 5 ఇంచెస్ డిస్‌ప్లేతో యూనిసాక్ 9832 ఇ క్వాడ్ కోర్ ప్రోసెసర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర అన్నింటికంటే తక్కువగా 3 వేల 590 రూపాయలు మాత్రమే. 

Also read: Todays Gold Rate: మళ్లీ పెరుగుతున్న బంగారం, దేశంలో ఇవాళ మే 24న వివిధ నగరాల్లో బంగారం ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News