Covid Cases: తగ్గిన కేసులు.. పెరిగిన మరణాలు! దేశంలో 92 వేలు దాటిన కొవిడ్ యాక్టివ్ కేసులు..

Covid 19 Updates : దేశంలో కొవిడ్ కేసులు కాస్త తగ్గాయి. నిన్నటి పోల్చితే కొవిడ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 11 వేల 739 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం శుక్రవారం 15,940 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. శనివారం  కేసుల సంఖ్య తగ్గింది.

Written by - Srisailam | Last Updated : Jun 26, 2022, 10:32 AM IST
  • 92 వేలు దాటిన యాక్టివ్ కేసులు
  • గత 24 గంటల్లో 11,739కేసులు
  • నిన్నటి కంటే తగ్గిన కొవిడ్ కేసులు
Covid Cases: తగ్గిన కేసులు.. పెరిగిన మరణాలు! దేశంలో 92 వేలు దాటిన కొవిడ్ యాక్టివ్ కేసులు..

Covid 19 Updates : దేశంలో కొవిడ్ కేసులు కాస్త తగ్గాయి. నిన్నటి పోల్చితే కొవిడ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 11 వేల 739 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం శుక్రవారం 15,940 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. శనివారం  కేసుల సంఖ్య తగ్గింది. గడచిన 24 గంటల్లో 25 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5 లక్షల 24 వేల 999కు చేరుకుంది.

గత 24 గంటల్లో కొవిడ్ నుంచి 10,917ల మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 92,576ల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత ఐదు నెలల్లో ఇది గరిష్టం.  దేశంలో రికవరీ రేటు 98.5 శాతంగా ఉంది. క్రియాశీల కేసుల సంఖ్య 0.21 శాతానికి పెరిగింది. దేశంలో పాజిటివిటి రేట్ ప్రమాదకరంగా పెరుగుతోంది. రోజువారి పాజిటివిటి రేట్ 4 .3 శాతం దాటడం వైద్య వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా మాస్కులు దరించాలని వైద్యులు సూచిస్తున్నారు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో కొవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి.  

తెలంగాణలోనూ కొవిడ్ విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య 5 వందలకు దగ్గరలో ఉంది.  గత 24 గంటల్లో 28,808 కరోనా పరీక్షలు చేయగా.. 496 మందికి పాజిటివ్ గా తేలింది. హైదరాబాదులోనే  341 కొత్త కేసులు వచ్చాయి. మరో ఆరు వారాల వరకు కొవిడ్ కేసులు పెరుగుతాయని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. 

Also Read: Teachers Assets Declaration: టీచర్ల ఆస్తుల లెక్కలపై వెనక్కి తగ్గిన కేసీఆర్ సర్కారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News