Packaged Fruit Juice: ఆధునిక జీవన శైలి, ఉరుకులు పరుగుల జీవితం కారణంగా ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోతున్నాయి. ఎక్కువగా ప్యాకేజ్డ్ జ్యూస్‌పై ఆధారపడుతున్నారు. ప్యాకేజ్డ్ జ్యూస్ ఎంత ప్రమాదకరమో తెలుసా..ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలుసుకుందాం..
ఆధునిక పోటీ ప్రపంచంలో అంతా రెడీమేడ్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఆహార పదార్ధాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ నుంచి మొదలుకుని..రాత్రి డిన్నర్ వరకూ అంతా ఇదే. మార్కెట్లో కూడా అన్ని రకాల ప్యాకేజ్డ్ జ్యూస్‌లు లభిస్తున్నాయి. ఏ ఫ్రూట్ జ్యూస్ కావాలన్నా..టెట్రాప్యాక్‌లో సిద్ధంగా ఉంటున్నాయి. ఆరోగ్యం కోసం ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలనే ఉద్దేశ్యంతో చాలామంది తెలియక..ఈ టెట్రాప్యాక్ జ్యూస్లపై ఆధారపడుతున్నారు. కానీ ఈ ప్యాకేజ్డ్ జ్యూస్‌లు ఆర్యోగానికి హానికారకమని చాలామందికి తెలియదు. ప్యాకేజ్ జ్యూస్‌లు తరచూ తాగితే కలిగే నష్టాలేంటో చూద్దాం..
ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్‌తో నష్టాలు
ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్‌లను సురక్షితంగా ఉంచేందుకు, ఎక్కువకాలం పాడవకుండా ఉండేందుకు కొన్ని రకాల కెమికల్స్ కలుపుతారు. అందుకే పిల్లలకు ఈ జ్యూస్‌లు మంచిది కాదు. మీ పిల్లలు తరచూ ప్యాకేజ్డ్ జ్యూస్‌లు వినియోగిస్తుంటే..వెంటనే మాన్పించండి. లేకపోతే అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్‌లు అలవాటు చేస్తే..మంచిది. లేకపోతే ఫుడ్ ఎలర్జీ, స్కిన్ ఎలర్జీలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
టెట్రాప్యాక్ ఫ్రూట్ జ్యూస్‌లు తాగితే..డయేరియా, మలబద్ధకం, అజీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. ఎందుకంటే ప్యాకెట్ జ్యూస్‌లలో ఫైబర్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఫలితంగా జీర్ణ సమస్య ప్రధానంగా కన్పిస్తుంది. మార్కెట్లో లభ్యమయ్యే అన్ని జ్యూస్‌లలో కార్బానిక్స్, కాడ్మియం, మెర్క్యురీ వంటి కెమికల్స్ కలుపుతారు. ఇవి తాగడం వల్ల పిల్లల మెదడుపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే ప్యాకెట్ ఫ్రూట్ జ్యూస్‌లకు దూరంగా ఉండాలి. అంతేకాదు..ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్‌లు తరచూ తీసుకోవడం వల్ల స్థూలకాయం సమస్య కచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇందులో షుగర్ స్థాయి ఎక్కువగా ఉండి..బరువు పెరుగుతారు.
Also read: Walnuts Benefits: రోజూ పరగడుపున వాల్నట్స్ తీసుకుంటే కలిగే ప్రయోజనాలు వింటే ఆశ్చర్యపోతారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి