Astro tips: హిందూమతంలో ప్రతి రోజుకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. శాస్త్రం ప్రకారం ప్రతి రోజు ఏదో ఒక దేవతకు అంకితం చేశారు. ఏడు వారాల్లో ఆదివారాన్ని సూర్య దేవుడికి అంకితం చేశారు. ఈ రోజు పూజలు, కర్మలు చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా కొన్ని రాశుల వారికి సూర్యుడి స్థానం బలపడుతుంది.ఆదివారాలు సూర్యభగవానుని ఆరాధించి.. గంగా నది ఒడ్డున నీరు సమర్పించడం, మంత్రాలను పఠించడం ద్వారా అదృష్టం పెరుగుతుందని శాస్త్రం చెబుతోంది.
అంతేకాకుండా ప్రతి పనిలో విజయం సాధిస్తాడని పేర్కొంది. ఈ రోజున సూర్య మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన అన్ని కోరికలు నెరవేరుతాయి. అయితే ఆదివారం నాడు ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో తెలుసా?.. సూర్యునికి పూజ చేసే క్రమంలో చాలా మంది పలు రకాల తప్పులు చేస్తున్నారు. కావున ఈ కింద పేర్కొన్న అంశాలను దృష్టిలో పెట్టుకుని పూజించడం వల్ల తప్పకుండా పలు రకాల లాభాలు చేకూరుతాయి.
సూర్య పూజకు ముందు ఇలా చేయకూడదు:
మాంసం, మద్యానికి దూరంగా ఉండండి:
హిందూ మతంలో కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఇందులో ఆదివారాల్లో మాంసాహారం, మద్యానికి దూరంగా ఉండాలని శాస్త్రంలో పేర్కొన్నారు. మాంసాహారం తీసుకోవడం అశుభం జరుగుతుందని తెలిపింది. ఆదివారం తనడం వల్ల సూర్యభగవానుడు కోపింస్తాడని శాస్త్రం చెబుతోంది.
సూర్యాస్తమయం తర్వాత ఉప్పు తినండి:
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఏ వ్యక్తి కూడా ఆదివారం ఉప్పు తినకూడదని పేర్కొంది. అయితే హిందు సాంప్రదాయ ప్రకారం సూర్యాస్తమయం తరువాత ఉప్పును తినాలని శాస్త్రం సూచిస్తోంది.
ఈ రంగు దుస్తులు ధరించవద్దు
ఈ రోజున రాగితో చేసిన లోహాల కొనుగోలు చేయడం మంచిది కాదని శాస్త్రం హెచ్చరిస్తోంది. అలాగే, నీలం, నలుపు, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించకూడదని శాస్త్రం చెబుతోంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also read: Bank Holidays July: జూలై నెలలో బ్యాంక్ పనులుంటే సమస్యే..16 రోజులు సెలవులు, ఇదే సెలవుల జాబితా
Also read: Pisces Monthly Horoscope 2022: ఈ రాశి వారికి ఈ నెలంతా లాభాలే.. ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook