Astrology Tips: కేవలం పదిరోజుల్లో మారిపోనున్న జాతకం, ఆ రాశులవారికి డబ్బే డబ్బు

Astrology Tips: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రగ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది. సౌందర్యం, తెలివి ప్రసాదించేది ఈ గ్రహమే. మీ జాతకంలో శుక్రగ్రహం సంబంధముంటే..పదిరోజుల్లో అంతా మారిపోతుంది. మీకు అదృష్టం కలిసొస్తుంది.

Last Updated : Jul 2, 2022, 04:48 PM IST
Astrology Tips: కేవలం పదిరోజుల్లో మారిపోనున్న జాతకం, ఆ రాశులవారికి డబ్బే డబ్బు

Astrology Tips: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రగ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది. సౌందర్యం, తెలివి ప్రసాదించేది ఈ గ్రహమే. మీ జాతకంలో శుక్రగ్రహం సంబంధముంటే..పదిరోజుల్లో అంతా మారిపోతుంది. మీకు అదృష్టం కలిసొస్తుంది.

శుక్రగ్రహం జూలై 13 నుంచి మిధున రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావం ఏయే రాశులపై పడుతోంది, ఎవరెవరికి ఏం ప్రయోజనం కలగనుందో పరిశీలిద్దాం..ప్రతినెలా అన్ని గ్రహాలు రాశి మారుతుంటాయి. జూలై నెల మొదలైంది. ఈ నెలలో 5 కీలకమైన గ్రహాలు రాశి మారుతున్నాయి.ఇందులో శుక్రుడు ఒకటి. ఈ గ్రహం జూలై 13న..బుధుడి రాశిగా ఉన్న మిధునంలో ప్రవేశించి..ఆగస్టు 7 వరకూ అదే గ్రహంలో ఉంటాడు. ఆ తరువాత కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. జ్యోతిష్యం ప్రకారం ఏదైనా గ్రహం రాశి మారితే..ఆ ప్రభావం 12 రాశులపై ఉంటుంది. ఈ గ్రహం ధనానికి, విలాసానికి ప్రతీక. శుక్ర గ్రహం స్థాన చలనం కారణంగా ఏ రాశులకు, ఏయే ప్రయోజనాలు చేకూరనున్నాయో పరిశీలిద్దాం.

మిథున రాశి వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడి గోచారం కారణంగా ఉద్యోగస్థుల జీవితంలో మంచి పరిణామాలుంటాయి. చాలా ప్రయోజనాలు చేకూరే పరిస్థితి ఉంటుంది. విదేశీ కంపెనీల్లో పనిచేసేవారికి మరింత అద్భుతంగా ఉంటుంది. ఏదైనా యాత్రకు వెళ్తున్నా ప్రయోజనాలు చేకూరుతాయి. ఎవరితోనైనా కలిసి పనిచేసేటప్పుడు లాభాలు ఆర్జిస్తారు. పాజిటివ్‌గా ఉంటుంది. 

తులరాశి వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ధనలాభం ఉంటుంది. అదృష్టం పూర్తిగా కలిసొస్తుంది. పితృ సంబంధిత ఆస్థులతో లాభాలు అందుతాయి. కష్టపడితే ప్రయోజనముంటుంది. వ్యాపారంలో ఏదైనా మంచి డీల్ చేయగలరు. కెరీర్‌లో ముందుకెళ్లేందుకు చేయూత లభిస్తుంది. 

ధనస్సు రాశివారికి ఈ సమయం పూర్తిగా అనుకూలం. మీ ఆర్ధిక స్థితి మెరుగుపడుతుంది. ఒకవేళ మీరు జాయింట్‌గా కలిసి పనిచేస్తుంటే..లాభాలొస్తాయి.ఉద్యోగస్థులకు అనువైన సమయం. ఆఫీసులో మీ పరిస్థితి చాలా బలంగా ఉంటుంది.వేతనం పెరిగే అవకాశాలున్నాయి.

కుంభరాశి వారికి ఆర్ధికంగా బాగుంటుంది.కెరీర్ పరంగా పాజిటివ్ పరిణామాలుంటాయి. ఆదాయం మార్గాల్లో పెంపు ఉంటుంది. ఈ సందర్భంగా బాస్, ఇతర అధికారులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. వారి సహకారం లభిస్తుంది. ఉద్యోగస్థులకు చాలా అనువైన సమయం. ప్రతి పనిలో అధృష్టం చేయూతనిస్తుంది. విజయం లభిస్తుంది. 

Also read: Chant Gayatri Mantra: చదుపుపై ఆసక్తి పెరగాలంటే... ఈ మంత్రాన్ని జపించాల్సిందే!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News