High Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ఇవి తినకండి!

High Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే దీని వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2022, 05:06 PM IST
High Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ఇవి తినకండి!

High Cholesterol:  మనం ఎంత బిజీగా ఉన్నా టైం కు తినడం మరచిపోకూడదు. ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాలి. అయితే ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు కారణంగా అనేక రకాల వ్యాధులు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఇందులో కొలెస్ట్రాల్ కూడా ఒక కారణం. కాబట్టి కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కొలెస్ట్రాల్ (High Cholesterol) స్థాయిలను అదుపులో ఉంచుకోవాలంటే.. ముందుగా మీరు మీ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.

ఇవి తినకండి..
>> మీరు మాంస ప్రియులు అయితే మాంసానికి దూరంగా ఉండండి. అస్సలు తినకండి. ఎందుకంటే ఇది మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని  పెంచుతుంది. శరీరంలో ఇది పెరిగందంటే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. 
>> చికెన్ తినేవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది మీ శరీరంలో కొలెస్ట్రాల్ మొత్తాన్ని పెంచుతుంది. 
>> అధిక కొలెస్ట్రాల్ ఉన్న పాల ఉత్పత్తులు, చీజ్ వంటి వాటిని తీసుకోకూడదు. దీని వల్ల మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది.
>> కుకీలు, కేక్ లు వంటి బేకరీ వస్తువులను తినడం మానేయండి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Benefits of Ginger Tea: అల్లం టీ తాగడం వల్ల ఎన్ని అద్భుతమైన లాభాలో తెలుసా? 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News