కెనడాలోని టొరంటో నగరంలో ఓ దుండగుడు వ్యానుతో దాడికి పాల్పడ్డాడు. సెంట్రల్ టొరంటోలోని యాంజ్ స్ట్రీట్లో సోమవారం మధ్యాహ్నం తెలుపు రంగు వ్యాను ఒకటి హఠాత్తుగా పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందినట్లు, 16 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రమాదంపై మధ్యాహ్నం 1.30 గంటలకు తమకు సమాచారం అందినట్లు వెల్లడించారు. పాదచారుల్ని ఢీకొట్టిన అనంతరం నిందితుడు ఘటనాస్థలి నుంచి పరారయ్యాడన్నారు. వెంటనే పోలీసులు వ్యాను వెంబడించి డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. దాడికి గల కారణాలు ఇంకావెల్లడికాలేదు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఇక్కడి సబ్వే ను మూసివేసిన పోలీసులు.. ఘటనాస్థలికి రావొద్దని ప్రజలకు సూచించారు.
Acting Chief Peter Yuen: 9 people dead, 16 people injured. One man in custody, after incident involving vehicle on Yonge Street. ^js
— Toronto Police (@TorontoPolice) April 23, 2018