Trending Video: రోడ్డు మధ్యలో కుందేళ్ల పోరు.. మామూలుగా లేదు గురూ..

Viral Video Today: సోషల్ మీడియాలో ఈ మధ్య యానిమల్స్ కు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతోంది. తాజాగా కుందేళ్లకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 9, 2022, 06:57 PM IST
  • వైరల్ అవుతున్న కుందేళ్ల వీడియో
  • కామెంట్ల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు
Trending Video: రోడ్డు మధ్యలో కుందేళ్ల పోరు.. మామూలుగా లేదు గురూ..

Viral Video Today: ప్రతిరోజూ జంతువులకు సంబంధించిన వైరల్ వీడియోలను మనం ఇంటర్నెట్ లో చూస్తాం. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే... మరికొన్ని వీడియోలు షాక్ కు గురిచేస్తాయి. తాజాగా కుందేళ్లుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. చూడటానికి చాలా క్యూట్ గా ఉంది ఈ వీడియో. కుందేళ్లు అడవిని వదిలి రోడ్లుపై పోట్లాడుకోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. కామెంట్ల వర్షం కురుస్తుంది. అంతగా ఈ వీడియోలో ఏముందో చూడాలనుకుంటున్నారా మీరు ఓ లుక్కేయండి. 

వీడియో ఓపెన్ చేస్తే... ఓ పార్కింగ్ ప్రాంతంలోని రోడ్డు మధ్యలో రెండు కుందేళ్లు ఫైట్ చూసుకుంటూ ఉంటాయి. ఆ రెండు రాబిట్స్ తమ వెనుక కాళ్లపై నిలబడి పోట్లాడుకుంటాయి. కొంత సమయం తర్వాత వాటిలో ఒకటి పారిపోతుంది మరొకటి తనని వెంబడిస్తుంది. ఈ వీడియో Buitengebieden అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. ఇప్పటికే ఈ వీడియోను 1.4మిలియన్లకుపైగా వీక్షించారు. 65వేల మంది లైక్ చేశారు. అంతేకాకుండావేలాది మంది వినియోగదారులు ఈ పోస్ట్‌ను రీ-ట్వీట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఒకరు వీధిపోరాటం అని కామెంట్ చేస్తే... మరొకరు పోరాటం హోరాహోరీగా ఉందని ట్వీట్ చేశారు. 

Also Read: Viral Video Today: రెండు సెకన్లు అయితే ఆ వక్తి ప్రాణాలు గాలిలో కలిసేవి.. నెట్టింట తెగ వైరల్‌ అవుతున్న వీడియో..!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News