Shinzo Abe Assasination Agnipath Link: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య ఆ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. జపాన్ లాంటి అత్యంత సురక్షితమైన దేశంలో మాజీ ప్రధాని హత్య ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. షింజో అబే హంతకుడు యమగామి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అబే అనుసరించిన విధానాలపై అసంతృప్తితో పాటు ఓ మతపరమైన సంస్థతో అతనికి ఉన్న సంబంధాలు, ఆ సంస్థకు విరాళమిచ్చిన అతని తల్లి ఆర్థికంగా దివాళా తీయడమే తనను ఈ హత్యకు ప్రేరేపించినట్లు యమగామి పోలీసులతో చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి. అదే సమయంలో షింజో అబే హత్యకు భారత్‌లో కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌కు ముడిపెడుతూ ఆసక్తికర చర్చ తెరపైకివచ్చింది.
కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ, తృణమూల్ కాంగ్రెస్ మౌత్ పీస్ జాగో బంగ్లా ఈ చర్చకు తెరలేపాయి. షింజో అబే హంతకుడు యమగామి భారత్‌లో అగ్నిపథ్ తరహా స్కీమ్ బాధితుడని ప్రమోద్ తివారీ పేర్కొన్నారు. భారత్‌లో అగ్నివీరుడి తరహాలో జపాన్ సైన్యంలో అతను మూడేళ్లు పనిచేశాడన్నారు. ఆ తర్వాత నిరుద్యోగిగా మిగిలిపోయాడని పేర్కొన్నారు. ఈ ఉదంతం నుంచైనా కేంద్రంలోని బీజేపీ పాఠాలు నేరుస్తుందని.. సైన్యంలో శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
టీఎంసీ మౌత్ పీస్ జాగో బంగ్లా పత్రికలోనూ షింజో అబే హత్యను భారత్‌లో అగ్నిపథ్‌కి ముడిపెడుతూ ఓ కథనం ప్రచురితమైంది. 'షింజో అబే హత్యలో అగ్నిపథ్ ఛాయలు' అనే శీర్షికన ఈ కథనం ప్రచురితమైంది. షింజో అబే హంతకుడు యమగామి భారత్‌లో అగ్నిపథ్ స్కీమ్ తరహాలోనే జపాన్ మిలటరీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేశాడని అందులో పేర్కొన్నారు. సర్వీస్ ముగిశాక అతనికి ఫించన్ సహా ఎటువంటి రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందలేదన్నారు. ఉద్యోగం కోల్పోవడం వల్లే షింజో అబేపై తాను ఆగ్రహంతో, అసంతృప్తితో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడని పేర్కొన్నారు. భారత్‌లోనూ కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్‌తో ఇదే తరహా నియామకాలు చేపట్టేందుకు సిద్ధమైందన్నారు. దేశంలో అగ్నిపథ్ స్కీమ్ పట్ల పెల్లుబికిన ప్రతిఘటనకు జపాన్ ఉదంతం బలం చేకూర్చేలా ఉందని పేర్కొన్నారు.
షింజో అబే హత్యకు, అగ్నిపథ్ స్కీమ్‌కు ముడిపెట్టడంపై బీజేపీ ఫైర్ అయింది. బెంగాల్ బీజేపీ చీఫ్ మనోజ్ టిగ్గా దీనిపై స్పందించారు. 'మోదీ ఏం చేసినా టీఎంసీ దానికి వ్యతిరేకంగా చేస్తుంది. దేశం పట్ల వారికి ప్రేమ లేదు. జాగో బంగ్లాలో రాసిన కథనం పూర్తిగా తప్పు. దేశ యువను టీఎంసీ తప్పుదోవ పట్టించాలనుకుంటోంది. బీజేపీ జాతీయ భావాలను పెంపొందించే పనిచేస్తుంటే టీఎంసీ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది.' అని ఆరోపించారు. ఏదేమైనా షింజో అబే హత్యకు, అగ్నిపథ్ స్కీమ్‌కు ముడిపెడుతూ విపక్షాలు ముందుకు తెచ్చిన వాదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read: HEAVY RAINS:తెలంగాణలో కుంభవృష్ణి.. భూపాలపల్లి జిల్లాలో 323 మిల్లిమీటర్ల వర్షం.. వరదలతో జనం అతలాకుతలం
Also Read: England vs India : ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ మనదే.. రెండో టీ20లో టీమిండియా సునాయాస విజయం..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook