Rohit Sharma 10 year old tweet on Suryakumar Yadav goes viral: నాటింగ్‌హామ్ వేదికగా ఆదివారం రాత్రి ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. భారీ ఛేదనలో కీలక వికెట్లు పడిన సమయంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు సూర్య సూపర్ సెంచరీ బాదాడు. సూర్య ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడుతూ.. 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 117 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్ల సహకారం లేకపోవడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు కానీ సూర్య ఇన్నింగ్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. టీ20ల్లో మొదటి శతకం బాదిన సూర్యపై ప్రశంశల వర్షం కురుస్తోంది.
సూర్యకుమార్ యాదవ్ వీరోచిత శతకం తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ పదేళ్ల క్రితం చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సూర్య సూపర్‌స్టార్ అవుతాడని పదేళ్ల క్రితమే రోహిత్ జోస్యం చెప్పాడు. 'ఇప్పుడే చెన్నైలో బీసీసీఐ అవార్డుల ఫంక్షన్ పూర్తయింది. మంచి క్రికెటర్లు రాబోతున్నారు. ముంబై నుంచి సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తులో ఓ సూపర్‌స్టార్ అవుతాడు' అని రోహిత్ 2011 డిసెంబర్ 10న ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది.
టీ20 ఫార్మాట్‌లో తొలి సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ శర్మ తర్వాత అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో రోహిత్ 118 పరుగులు చేయగా.. సూర్య 117 రన్స్ చేశాడు. టీ20 ఫార్మాట్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోరు సాధించిన మొదటి బ్యాటర్‌గా కూడా నిలిచాడు. అంతకుముందు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ బెంగళూరులో 2019లో జరిగిన మ్యాచ్‌లో 113 రన్స్ చేశాడు.
Just got done with BCCI awards here in chennai..some exciting cricketers coming up..Suryakumar yadav from Mumbai to watch out for in future!
— Rohit Sharma (@ImRo45) December 10, 2011
టీ20 ఫార్మాట్‌లో సెంచరీ చేసిన ఐదో భారత బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. సూర్య కంటే ముందు రోహిత్ శర్మ (4), కేఎల్ రాహుల్ (2), సురేశ్ రైనా (1), దీపక్ హుడా (1) ఈ ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 198 పరుగులు చేసి ఓడిపోయింది.
Also Read: మణిరత్నం సినిమానే వదులుకున్న కీర్తి సురేశ్.. కారణం ఏంటో తెలుసా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook