Uddhav Thackeray: ఎంపీల అల్టిమేటంతో ఉద్ధవ్ ఠాక్రేకి పెద్ద చిక్కు.. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఎవరికి..?

Shiv Sena MPs Ultimatum to Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రే అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎంపీల అల్టిమేటంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతునివ్వబోతున్నారనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 12, 2022, 08:51 AM IST
  • మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకి పెద్ద చిక్కు
  • రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతునివ్వాలనే విషయంలో సందిగ్ధం
  • ద్రౌపది ముర్ముకే మద్దతునివ్వాలని పట్టుబడుతున్న ఎంపీలు
 Uddhav Thackeray: ఎంపీల అల్టిమేటంతో ఉద్ధవ్ ఠాక్రేకి పెద్ద చిక్కు.. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఎవరికి..?

Shiv Sena MPs Ultimatum to Uddhav Thackeray: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకి మరో చిక్కు వచ్చిపడింది. రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన పార్టీ ఎంపీల సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రేకి ఎంపీలు ఒకరకంగా అల్టీమేటం జారీ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకే మద్దతునివ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు, ఎంపీ, ఆ పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ ఈ డిమాండును తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తోంది. రెండు రోజుల్లోగా ఆయన దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే మద్దతునివ్వాలని ఎంపీల సమావేశంలో సంజయ్ రౌత్ గట్టిగా వాదించారు. అయితే 12 మంది శివసేన లోక్‌సభ ఎంపీలు మాత్రం సంజయ్ రౌత్ వాదనతో వ్యతిరేకించారు. ద్రౌపది ముర్ముకే శివసేన మద్దతునివ్వాలని గట్టిగా డిమాండ్ చేశారు. తొలిసారి ఒక ఆదివాసీ మహిళకు ఆ అవకాశం వచ్చినందునా ముర్ముకే మద్దతునివ్వాలని పేర్కొన్నారు. ఈ సమావేశం తర్వాత సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

ఈ సమావేశానికి శివసేనకు చెందిన ఏడుగురు లోక్‌సభ ఎంపీలు డుమ్మా కొట్టడం గమనార్హం. 19 మంది ఎంపీలకు గాను కేవలం 12 మంది మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. గైర్హాజరైన ఎంపీల్లో సీఎం, శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే కూడా ఉన్నారు. దీనిపై ఎంపీ గజానన్ కిరీట్కర్ మాట్లాడుతూ..  ఇద్దరు ఎంపీలకు ఆరోగ్యం బాగాలేనందునా సమావేశానికి హాజరుకాలేదని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న ఎంపీలంతా ఉద్ధవ్ ఠాక్రేకి మద్దతుగా ఉన్నారని పేర్కొన్నారు.రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ముకే మద్దతునివ్వాలని కోరినట్లు చెప్పారు.

ఎంపీల అల్టీమేటంతో ఉద్ధవ్ ఠాక్రే అందుకు తలొగ్గుతారా.. తమ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన బీజేపీ అభ్యర్థికి మద్దతునిస్తారా అనేవి చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ ఠాక్రే ముర్ముని కాదని యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించే పక్షంలో ఎంపీలు ఆయన నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేది అనుమానమే. ఎంపీల అభీష్ఠానికి వ్యతిరేకంగా ఠాక్రే నిర్ణయం తీసుకుంటే ఎమ్మెల్యేల లాగే ఎంపీ వర్గంలోనూ చీలిక వచ్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే పార్టీకి మరింత డ్యామేజ్ తప్పదు. ఇప్పటికైతే శివసేన భాగస్వామిగా ఉన్న మహావికాస్ అఘాడీ ఇంకా ఉనికిలోనే ఉంది. దాని మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఎన్‌సీపీలు రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికాయి. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే ఎంపీలు చెప్పినట్లు చేస్తారా లేక మహా వికాస్ అఘాడీ కొనసాగింపు కోసం యశ్వంత్ సిన్హాకే మద్దతునిస్తారా అనేది వేచి చూడాలి.

Also Read: Group 1 Application Mistakes Editing: గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మరో ఛాన్స్

Also Read: Telangana Rain Updates: ఆగని వాన... ఆ 21 జిల్లాల్లో ఇవాళ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్... 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News