Group 1 Application Mistakes Editing: గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మరో లాస్ట్ ఛాన్స్

Group 1 Application Mistakes Editing: గ్రూప్ 1 అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ 26న వెలువడిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వారి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మరోసారి ఎడిట్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ టిఎస్‌పీఎస్‌సి ఉత్తర్వులు జారీచేసింది.

Written by - Pavan | Last Updated : Jul 12, 2022, 08:07 AM IST
  • గ్రూప్ 1 అభ్యర్థులకు శుభవార్త చెప్పిన టీఎస్పీఎస్సీ
  • గ్రూప్ 1 దరఖాస్తులు సరిదిద్దుకునేందుకు మరో అవకాశం
  • ఆందోళనలో ఉన్న అభ్యర్థులకు ఊరటనిచ్చే ప్రకటన
Group 1 Application Mistakes Editing: గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మరో లాస్ట్ ఛాన్స్

Group 1 Application Mistakes Editing: గ్రూప్ 1 అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ 26న వెలువడిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వారి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మరోసారి ఎడిట్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ టిఎస్‌పీఎస్‌సి ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులకు సంబంధించిన వివరాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రెస్ రిలీజ్ ద్వారా అభ్యర్థులకు తెలియజేసింది. టిఎస్పీఎస్సీ ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం.. గ్రూప్ 1 నోటిఫికేషన్‌కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో కొంతమంది తమ వివరాలు పొందుపర్చడంలో పొరపాట్లు దొర్లాయని.. ఆ తప్పులను సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించాల్సిందిగా అభ్యర్థులు కమిషన్‌కి విన్నవించుకున్నారు.

గ్రూప్ 1 అభ్యర్థులు చేసుకున్న ఈ విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న టీఎస్‌పీఎస్‌సి.. వారికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్లో తప్పుగా నమోదైన వివరాలను సరిదిద్దుకునేందుకు వీలు కల్పిస్తూ ఈ ఉత్తర్వులు జారీచేసింది. టిఎస్‌పీఎస్‌సి అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.in లో ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులు ఎడిట్ చేసుకోవచ్చని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టంచేసింది. టీఎస్పీఎస్సీ (TSPSC Group 1 Notification) దరఖాస్తులో తప్పులు దొర్లిన కారణంగా ఆందోళనకు గురవుతున్న అభ్యర్థులకు ఈ గుడ్ న్యూస్ కొంత ఊరటనివ్వనుంది.

Also Read : Telangana Eamcet-2022: 14 నుంచి ఎంసెట్ పరీక్ష యధాతథం..ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన..!

Also Read : Telangana Rain ALERT: గోదావరికి వందేళ్ల రికార్డ్ వరద.. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర హైటెన్షన్

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News