Green Tea Benefits: గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇందులో ఆ నాలుగు రకాల వస్తువులు కలుపుకుని తాగితే...కేన్సర్‌కు కూడా చెక్ పెట్టవచ్చంటున్నారు వైద్య నిపుణులు.
సాధారణ టీ కంటే గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి అన్ని విధాలా ఉపయోగం. బరువు తగ్గేందుకు, ఇతర సమస్యల పరిష్కారానికి గ్రీన్ టీ తాగమనే వైద్యులంతా చెబుతుంటారు. ఇదే గ్రీన్ టీలో కొన్ని వస్తువులు కలిపి సేవిస్తే గ్రీన్ టీ అద్భుత ఔషధంగా మారిపోతుంది. గ్రీన్ టీలో కలిపే ఆ 4 వస్తువులు, కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా, దాల్చిన చెక్క, అల్లం, నిమ్మ
గ్రీన్ టీలో పుదీనా ఆకులు, దాల్చిన చెక్క కాస్త కలుపుకుని తాగితే..ఇమ్యూనిటీ గణనీయంగా పెరుగుతుంది. దాంతోపాటు జీర్ణక్రియ మెరుగవుతుంది. చాలా సేపటి వరకూ ఆకలి వేయదు. ఫలితంగా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. ఇక మరో ముఖ్యమైన పదార్ధం అల్లం. గ్రీన్ టీలో అల్లం కలపడం వల్ల రుచి పెరుగుతుంది. అదే సమయంలో ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనం చేకూరుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా..కేన్సర్ వంటి ప్రమాదకర, ప్రాణాంతక వ్యాధుల్నించి కూడా సంరక్షించుకోవచ్చు.
ఇక గ్రీన్ టీలో కలుపుకునే మరో ముఖ్యమైన పదార్ధం నిమ్మకాయ. గ్రీన్ టీలో కాస్త నిమ్మ రసం కలుపుకుని తాగడం వల్ల రుచి పెరగడమే కాకుండా..యాంటీ ఆక్సిడెంట్లను పెంచడంలో దోహదపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి చాలా మంచిది. నిమ్మరసాన్ని చివర్లో కొద్దిగా కలుపుకుంటే మంచిది. గ్రీన్ టీలో స్టీవియా ఆకుల్ని కలుపుకుని తాగితే రుచి అద్భుతంగా మారుతుంది. స్టీవియా ఆకుల వల్ల గ్రీన్ టీలో తీయందనం వస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గుతుంది. డయాబెటిస్ రోగులకు స్టీవియా ఆకులు కలిపిన గ్రీన్ టీ తాగితే మంచిది.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook