India Covid 19 Vaccination: దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో మైలురాయిని చేరనుంది. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డోసుల పంపిణీ 200 కోట్లకు చేరనుంది. వ్యాక్సినేషన్‌లో 100 కోట్ల మార్క్‌ను 9 నెలల్లో చేరుకున్న భారత్.. 18 నెలల్లో 200 కోట్ల మార్క్‌కు చేరువైంది. శనివారం (జూలై 16) రాత్రి 9గం. వరకు దేశవ్యాప్తంగా 199.97 కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తయ్యాయి. ఇవాళ్టితో 200 కోట్ల డోసులు పూర్తయ్యే అవకాశం ఉంది. తద్వారా ప్రపంచంలో అత్యంత వేగంగా అత్యధిక వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిన రెండో దేశంగా భారత్ నిలవనుంది. భారత్ ఈ ఘనత సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.
భారత్ కన్నా ముందు స్థానంలో ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిన దేశంగా చైనా నిలిచింది. ఇప్పటివరకూ ఆ దేశం 340 కోట్ల వ్యాక్సిన్ డోసులను పూర్తి చేసింది. భారత్‌లో ఇప్పటివరకూ పూర్తి చేసిన వ్యాక్సిన్ డోసుల్లో 71 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే పంపిణీ చేయడం గమనార్హం. ఇప్పటివరకూ పూర్తి చేసిన డోసుల్లో 5.48 కోట్ల ప్రికాషన్ డోసులు, 12-14 ఏళ్ల వయసు వారికి ఇచ్చిన 3.79 కోట్ల ఫస్ట్ డోస్ వ్యాక్సిన్లు ఉన్నాయి.
జనవరి 16, 2021లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించిన భారత్.. 18 నెలల కాలంలోనే 200 కోట్ల మార్క్‌ను చేరుకోవడం మోదీ నాయకత్వం వల్లే సాధ్యమైందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్ 200 కోట్ల వ్యాక్సిన్ డ్రైవ్‌కు చేరువవడంపై కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ట్విట్టర్‌లో స్పందించారు. మోదీ నాయకత్వంలో భారత్ 200 కోట్ల వ్యాక్సిన్ డోసులను పూర్తి చేసుకునేందుకు చేరువైందన్నారు. 200 కోట్ల మార్క్‌కి కౌంట్ డౌన్ మొదలైందంటూ ట్వీట్ చేశారు.
Witness the history in making!
India under PM @NarendraModi Ji's leadership is all set to achieve the 200-crore COVID-19 vaccination mark!
Countdown starts! ⏱️https://t.co/xpQRR4r9eq pic.twitter.com/n08gFyw6qf
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 16, 2022
Also Read: Godavari Floods Live: అటు గవర్నర్.. ఇటు కేసీఆర్.. వరద ప్రాంతాల్లో పోటాపోటీ పర్యటన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook