Sravana Masam Somavaram: భారతీయులకు ఎంతో ప్రముఖ్యమైన శ్రావణ మాసం నెల మొదలైంది. అంతేకాకుండా శ్రావణ మాసం మొదటి సోమవారం రేపే కావున అందరూ శివున్ని ఆరాధించి ఉపవాలు చేస్తారు. అయితే సోమవారం (జూలై 18)న సాక్ష్యాత్తు మహాశివుడే భూమి పైకి వస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకే శివుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మం. శివునితో పాటు పార్వతీ దేవిని పూజించడం వల్ల కోరికన కోరికలు నెరవేరుతాయని శాస్త్రం చెబుతోంది. అయితే శ్రావణ మాసం మొదటి సోమవారం చేయకూడని పనులున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రావణ మాసం మొదటి సోమవారం ఈ పనులు చేయకండి:
>>శ్రావణ మాసంలో జుట్టును కత్తిరించకూడదు. షేవింగ్ కూడా తీసుకోవడం మంచిది కాదని శాస్త్రం పేర్కొంది.
>>గోళ్లు కత్తిరించడం, శరీరంపై నూనెతో మసాజ్ చేయడం వంటి పనులు అస్సలు చేయోద్దు. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
>>శ్రావణ మాసం మొదటి సోమవారం రోజునా ఉల్లి, వెల్లుల్లి, మాంసం తినకూడదు.
>>మొదటి సోమవారం రోజు విలాసాలకు దూరంగా ఉండడం మంచిది.
>>శ్రావణ మాసంలో మనస్సులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు పెట్టుకోవద్దు.
>>తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలి. ఉదయాన్నే తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి.
>>శ్రావణ మాసంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.
Also read: World Emoji Day: నేడే ప్రపంచ ఎమోజీ దినోత్సవం.. ఎందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారో తెలుసా..!
Also read: Beard Growing Tips: మీకూ ఒత్తైనా గడ్డం రావాలంటే ఇలా చేయండి.. నెలలోనే స్ట్రాంగ్ బియర్డ్ వస్తుంది..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook