Bunny Vasu Accident: నిర్మాత బన్నీ వాసుకు తృటిలో తప్పిన ప్రమాదం.. గర్భిణీ స్త్రీని కాపాడబోయి..!

Producer Bunny Vasu narrow escapes from Accident. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, జనసేన పార్టీ సభ్యుడు బన్నీ వాసు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 18, 2022, 01:01 PM IST
  • నిర్మాత బన్నీ వాసుకు తృటిలో తప్పిన ప్రమాదం
  • గర్భిణీ స్త్రీని కాపాడబోయి
  • రెండు సినిమాలను నిర్మిస్తున్న బన్నీ వాసు
Bunny Vasu Accident: నిర్మాత బన్నీ వాసుకు తృటిలో తప్పిన ప్రమాదం.. గర్భిణీ స్త్రీని కాపాడబోయి..!

Producer Bunny Vasu narrow escapes from Accident: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. గత 10 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పర్యటించారు. భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంత ప్రజలు కష్టాలు పడుతున్న వేళ వారికి సాయం చేయడానికి వెళ్లిన ఆయన వరదలో కొంతదూరం కొట్టుకుపోయారు. బన్నీ వాసు నిర్మాతగానే కాకుండా.. పవన్ కళ్యాణ్ స్థాపించిన 'జనసేన' పార్టీ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు.

ముంపు ప్రాంత ప్రజలు కష్టాలు పడుతున్న నేపథ్యంలో వారికి ఆపన్న హస్తం ఇవ్వడానికి జన సైనికులతో కలిసి ఆదివారం నిర్మాత బన్నీ వాసు పాలకొల్లులో పర్యటించారు. బాడవ గ్రామంలో చిక్కుకున్న వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ గర్భిణీ స్త్రీ కనిపించగా.. ఆమెను పడవలోకి ఎక్కించడానికి బన్నీ వాసు ప్రయత్నించారు. ఆడే సమయంలో ఒక్కసారిగా వరద ఉదృతి ఎక్కువైంది. దీంతో గర్భిణీ స్త్రీని లోపలి లాగడానికి అయన ప్రయత్నించారు. అయితే పడవ వరద ప్రవాహానికి కొట్టుకుపోయి ఒక కొబ్బరి చెట్టును ఢీకొని విరిగిపోయింది. 

పడవ  విరిగిపోవడంతో ప్రయాణికులందరూ నీళ్లలో పడిపోయారు. పడవ నడిపేవారు వెంటనే అందరిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. అందులో నిర్మాత బన్నీ వాసు కూడా ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. బన్నీ వాసు మాట్లాడుతూ... 'అదృష్టం బావుండి పడవ ప్రమాదం నుంచి అందరం బయటపడ్డాం. ప్రమాదంలో ఇంకా ఎన్నో గ్రామాలు ఉన్నాయి. వారందరినీ ప్రభుత్వం వెంటనే రక్షించాలి' అని కోరారు. ఇటీవలే 'పక్కా కమర్షియల్' సినిమాను నిర్మించిన బన్నీ వాసు..  మరో రెండు సినిమాలను నిర్మిస్తున్నారు. 

Also Read: వార్తా సంస్థల కంటెంట్‌ను ఉపయోగించుకోలంటే.. టెక్ సంస్థలు పేమెంట్ చెల్లించాల్సిందే!

Also Read: Weight Loss Tips: బరువు తగ్గాలనుకునే వారు తేనె, వెల్లుల్లి మిశ్రమంతో వారం రోజుల్లో బరువు తగ్గొచ్చు..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News