Ben Stokes: ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ వన్డే క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. పరిమిత మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రేపు సౌతాఫ్రికాతో తన చివరి మ్యాచ్ ఆడనున్నట్లు వెల్లడించాడు. తన రిటైర్మెంట్పై ఎంతో ఆలోచించానని.. ఆ తర్వాతే ఈనిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. ఇప్పటివరకు తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. సహచర క్రికెటర్లు, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సభ్యులు తనను ఎంతో ప్రోత్సహించారని ఈసందర్భంగా గుర్తు చేసుకున్నాడు. మూడు ఫార్మట్లలో క్రికెట్ ఆడటం అంటే సామాన్య విషయం కాదన్నాడు బెన్ స్టోక్స్.
ఇప్పటివరకు 104 వన్డేలు ఆడిన స్టోక్స్..2 వేల 919 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 102 పరుగులు టాప్ స్కోర్‌గా ఉంది. 74 వికెట్లు తీశాడు. ఇటు 83 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 5 వేల 280 పరుగులు సాధించాడు. మొత్తం 11 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ డబుల్ సెంచరీ ఉంది. ఇందులో 258 పరుగులు టాప్ స్కోర్‌గా ఉంది. బౌలింగ్‌లో 182 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు 34 టీ20 మ్యాచ్‌లు ఆడిన స్టోక్స్..442 పరుగులు చేశాడు. ఐపీఎల్లో 43 మ్యాచ్‌లు ఆడి..920 పరుగులు సాధించాడు.
11 years and countless ODI memories ❤️
Thank you, @benstokes38 👏 pic.twitter.com/TroqvkZwsw
— England Cricket (@englandcricket) July 18, 2022
Also read:Ambati Rambabu: పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చకు రావాలి..టీడీపీ నేతలకు అంబటి రాంబాబు సవాల్..!
Also read:Hardik Pandya: సూపర్ ఫామ్‌లో హార్దిక్ పాండ్య..తాజాగా అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త రికార్డు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook