Sravana vinayaka chaturthi 2022: శ్రావణ వినాయక చతుర్థి నాడు గణేశుడిని ఇలా పూజించండి!

Sravana Masam 2022: ఈ ఏడాది శ్రావణ మాసం వినాయక చతుర్థి పండుగ ఆగస్టు 1, 2022న జరుపుకోనున్నారు. ఈ రోజున  గణేశుడిని పూజించడం వల్ల మీ లైఫ్ లో అన్ని కష్టాలు తొలగిపోయి జీవితం ఆనందంగా ఉంటుంది. పూజ ముహూర్తం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 25, 2022, 01:10 PM IST
  • మరో వారం రోజుల్లో గణేష్ చతుర్థి
  • ముహూర్తం, పూజ విధానం తెలుసుకోండి
Sravana vinayaka chaturthi 2022: శ్రావణ వినాయక చతుర్థి నాడు గణేశుడిని ఇలా పూజించండి!

Sravana vinayaka chaturthi 2022: హిందువులు శ్రావణ మాసం మెుత్తం శివుడిని ఆరాధిస్తారు. ఈ మాసంలో ప్రతి మంగళవారం పార్వతీదేవి యెుక్క మంగళ గౌరీ వ్రతాన్ని పాటిస్తారు. అదేవిధంగా పార్వతీపరమేశ్వరుల కుమారుడైన గణేశుడిని కూడా ఈ మాసంలో పూజిస్తారు. ప్రతి నెల రెండు చతుర్థులు ఉంటాయి. అవే కృష్ణపక్ష చతుర్థి మరియు శుక్లపక్ష చతుర్థి. శ్రావణ మాసంలోని శుక్ల పక్షం చతుర్థి రోజున వినాయక చతుర్థి (Sravana vinayaka chaturthi 2022) జరుపుకుంటారు. ఈ సారి శ్రావణ వినాయక చతుర్థి 1 ఆగస్టు 2022 నాడు వచ్చింది. ఈ రోజున ఉపవాసం చేస్తూ.. వినాయకుడిని పూజిస్తే... మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. పూజ మహూర్తం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. 

శుభ ముహూర్తం
శ్రావణ వినాయక చతుర్థి తేదీ ప్రారంభం - 1 ఆగస్టు 2022, సోమవారం ఉదయం 4:18 గంటలకు
శ్రావణ  వినాయక చతుర్థి ముగింపు - 2 ఆగస్టు 2022, మంగళవారం ఉదయం 5.13 వరకు.
వినాయకుడి పూజకు అనుకూలమైన సమయం - ఉదయం 11.06 - మధ్యాహ్నాం 1.48 (1 ఆగస్టు 2022)
అభిజిత్ ముహూర్తం - మధ్యాహ్నాం 12.00 - 12.54 వరకు

వినాయకుడి పూజ విధానం
>> శ్రావణ వినాయక చతుర్థి వ్రతం రోజున ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. 
>> తర్వాత ఉపవాసం పాటిస్తూ.. గణేశుడి పూజ ప్రారంభించండి. 
>> పూజా పీఠంపై పసుపు వస్త్రం వేసి దానిపై గణపతి విగ్రహాన్ని లేదా ఫోటోను పెట్టండి. 
>> వినాయకుడిని షోడశోపచారాలుతో పూజించండి. దేవుడికి దుర్వా, పువ్వులు, పంచామృతం, బియ్యం, మోదకం, లడ్డూలు, కొబ్బరికాయలు మెుదలైనవి సమర్పించండి.
>> 108 సార్లు వినాయకుడి బీజ్ మంత్రంతోపాటు గణేష్ చాలీసాను పఠించండి.
>> వినాయక చతుర్థి కథను విని... అనంతరం దేవుడికి హారతి ఇవ్వండి. చివరగా అందరికీ ప్రసాదాన్ని పంచండి.
>> వినాయక చతుర్థి నాడు చంద్రుడిని చూడటం నిషిద్ధం. 

Also Read: Shani Dev: ఇంట్లో శనిదేవుడిని పూజించేటప్పడు ఈ తప్పు చేయకండి.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది!   

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News