Guru Pushya Yogam: గురు పుష్య యోగంలో ఈ వస్తువులను దానం చేస్తే... అంతులేని సంపద మీ సొంతం!

Donate On Guru Pushya Yog:  జ్యోతిషశాస్త్రంలో గురు పుష్య యోగం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ యోగం కూడా శ్రావణ అమావాస్య రోజునే వస్తుంది. ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మనిషికి పుణ్యం లభిస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 27, 2022, 03:31 PM IST
Guru Pushya Yogam: గురు పుష్య యోగంలో ఈ వస్తువులను దానం చేస్తే... అంతులేని సంపద మీ సొంతం!

Guru Pushya Nakshatra 2022: అరుదైన యోగాలలో గురు పుష్య యోగం కూడా ఒకటి. పుష్య నక్షత్రం గురువారం వస్తే దానిని గురు పుష్య యోగం (Guru Pushya Yogam) అంటారు. ఈసారి జూలై 28న గురు పుష్య యోగం రానుంది. అదే విధంగా ఇదే రోజున శ్రావణ అమావాస్య లేదా హరియాళీ అమావాస్య కూడా వస్తుంది. అంతేకాకుండా జూలై 28నే బృహస్పతి మీనంలో తిరోగమనం చేయనున్నాడు. ఇన్ని యాదృచ్ఛికాలు ఉన్న ఈ రోజు ఎంతో శుభదినంగా జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. గురు పుష్య యోగం శుభకార్యాలకు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. 

గురు పుష్య యోగం తేదీ 2022
హిందూ క్యాలెండర్ ప్రకారం, గురు పుష్య యోగం గురువారం, 28 జూలై 2022 ఉదయం 7:06 గంటలకు ప్రారంభమై.. జూలై 29, శుక్రవారం ఉదయం 9:47 గంటలకు ముగుస్తుంది. ఈ యోగంలో నగలు కొనడం, ఇంటి నిర్మాణం ప్రారంభించడం వంటివి శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ రోజున చేసే దానానికి కూడా విశేష ప్రాధాన్యత ఉంది.

ఈ వస్తువులను దానం చేయండి
ఈ రోజు అన్నం, బూందీ లడ్డు, కిచడీ, పప్పులు మొదలైన వాటిని దానం చేయడం చాలా శుభప్రదమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా ఈ యోగం దేనిపైనైనా పెట్టుబడి పెడితే అది ప్యూచర్ లో అధిక లాభాలను తీసుకురాగలదు. అలాగే ఈ రోజు గృహ నిర్మాణ పనులు, పెట్టుబడి, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.

Also Read: Mercury transit Effect: సింహరాశిలో బుధ సంచారం.. ఈ 5 రాశులవారిపై డబ్బు వర్షం!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News