/telugu/photo-gallery/tspsc-group-4-final-result-2024-category-wise-selected-candidates-list-check-full-details-here-rn-180895 TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. 180895

Weight loss Tips: స్థూలకాయం అనేది ప్రస్తుత రోజుల్లో దాదాపుగా అందర్నీ వేధిస్తున్న సమస్యగా మారింది. పెరుగుతున్న బరువు తగ్గించేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేసి విఫలమౌతుంటారు. కానీ రోజూ కేవలం 5 నిమిషాలు ఇలా చేస్తే..కచ్చితంగా బరువు తగ్గుతారు..

ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా స్థూలకాయం అందర్నీ వెంటాడుతోంది. జిమ్ లేదా వర్కవుట్లతో తగ్గించుకునే ఆస్కారముంది కానీ..బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా సాధ్యం కాని పరిస్థితి. బిజీ లైఫ్‌స్టైల్, టైమ్ షెడ్యూల్ కారణంగా బరువు తగ్గించేందుకు సమయం కేటాయించలేనివారికి ఇది లాభించే అంశం. రోజుకు కేవలం 5 నిమిషాలు ఇలా చేస్తే చాలు..మీ బరువు వేగంగా తగ్గుతుందని చెబుతున్నారు హెల్త్ డైటిషియన్లు. దీనికోసం జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. అదే సమయంలో డైట్ కూడా పెద్దగా ఏముండదు. ఆ వివరాలు తెలుసుకుందాం..

మనం చేసే చాలా ఎక్సర్‌సైజ్‌లు కొన్ని భాగాలకు ప్రయోజనకరంగా ఉంటాయి. కొన్ని మాత్రం మొత్తం శరీరానికి లాభదాయకంగా ఉంటాయి. కొన్ని వర్కవుట్స్ వల్ల శరీరంలో అన్ని భాగాల్లో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ముఖ్యంగా కడుపు, నడుము భాగాల్లో పేరుకున్న కొవ్వు కరిగించేందుకు ఈ పద్ధతి అద్భుతంగా పనిచేస్తుంది. 

రోజుకు కేవలం 5 నిమిషాలు చాలు

జంప్ స్క్వాట్, ఫార్వార్డ్ లంజ్, నీ డ్రైవ్, ఎయిర్ స్క్వాట్, బ్యాక్‌వర్డ్ లంజ్

స్క్వాట్ జంప్ లేదా జంప్ స్క్వాట్ రోజుకు 40 సెకన్లు చేస్తే చాలు. ముందుగా కాళ్లను 1-2 అడుగుల దూరం చాపాలి. మీ శరీరంపై భాగాన్ని స్ట్రైట్‌గా ఉంచుతూ.. తొడల్ని వంచుతూ కిందకు రావాలి. ఇప్పుడు కుర్చీ పొజీషన్‌లో కూర్చోవాలి. 

రెండవది ఫార్వర్డ్ లంజ్..దీనికోసం ముందుగా స్ట్రైట్‌గా నిలుచుని..కాళ్లను ముందుకూ వెనక్కి చేస్తూ రెండింటి మధ్య 30 డిగ్రీల కోణం ఉండేలా చూసుకోవాలి. శరీరాన్ని స్ట్రైట్‌గానే ఉంచి మోకాళ్లను వంచాలి. ఇప్పుడు వెనుకున్న కాలిని నెమ్మదిగా ఫోల్డ్ చేస్తూ నేలకు ఆన్చాలి. కాస్సేపు అదే స్థితిలో ఉండి..తిరిగి వెనక్కు రావాలి. ఇలా  ఓ 40 సెకన్లు చేయాలి.

మూడవది నీ డ్రైవ్..దీనికోసం రన్నింగ్ పొజీషన్ లో నిలుచోవాలి. శరీరం పైభాగం ముందుకు..దిగువ భాగం వెనక్కి ఉండేలా చేయాలి. ఓ కాలు ముందుకు..మరో కాలు వెనక్కి చేయాలి. వెనుక కాలిని ముందుకు తీసుకొచ్చి..కాళ్లతో చేతుల్ని తాకే ప్రయత్నం చేయాలి. ఇలా ఓ 5 సార్లు చేయాలి. రెండో కాలిని కూడా ఇలాగే చేయాలి. 

ఎయిర్ స్క్వాట్..దీనికోసం ముందుగా స్ట్రైట్‌గా నిలుచుండి..శరీరాన్ని నిటారుగా ఉంచాలి. చేతుల్ని ముందుకు సాచాలి. ఇప్పుడు మోకాళ్లను నెమ్మదిగా మడిచి..తొడల సమహాయంతో శరీరాన్ని దిగువకు దించాలి. కాస్సేపు ఇలానే ఉండి తిరిగి సాధారణ స్థితికి వచ్చేయాలి. ఇలా 40 సెకన్లు చేయాలి.

బ్యాక్‌వర్డ్ లంజ్..దీనికోసం ముందుగా నడుముపై చేతులుంచి నిటారుగా నిలుచోవాలి. కుడికాలిని ముందుకు..ఎడమ కాలిని వెనక్కి తీసుకోవాలి. ఇప్పుుడు కుడి మోకాలుని వంచి నేలకు ఆన్చాలి. అలాగే ఎడమ కాలిని కూడా మడవాలి. తరువాత ఎడమ కాలిని కూడా అలానే చేయాలి. రెండింటి మధ్య 2 సెకన్ల బ్రేక్‌తో 40 సెకన్లు చేస్తే చాలు. ఈ ఐదు ఎక్సర్‌సైజ్‌లు చేయడానికి ఐదు నిమిషాలకంటే ఎక్కువ సమయం పట్టదు. అయితే క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేయాలి.

Also read: Weight Loss Tips: బరువు తగ్గాలనుకునే వారు ఇలా వారం రోజుల్లో తగ్గొచ్చు..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Section: 
English Title: 
Weight loss tips and precautions, do these 5 exercise workout tips daily just for five minutes to reduce weight within 30 days weight loss program
News Source: 
Home Title: 

Weight loss Tips: రోజుకు కేవలం ఐదే ఐదు నిమిషాలు 5 ఎక్సర్‌సైజ్‌లు చేస్తే చాలు..బరువు

Weight loss Tips: రోజుకు కేవలం ఐదే ఐదు నిమిషాలు 5 ఎక్సర్‌సైజ్‌లు చేస్తే చాలు..బరువు తగ్గడం ఖాయం
Caption: 
Weight loss tips ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Weight loss Tips: రోజుకు కేవలం ఐదే ఐదు నిమిషాలు 5 ఎక్సర్‌సైజ్‌లు చేస్తే చాలు..బరువు
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Saturday, July 30, 2022 - 17:10
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
56
Is Breaking News: 
No