Monsoon Diet: వర్షాకాలం ఎంతగా ఆహ్లాదాన్నిచ్చినా..ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే అనర్ధాలు మిగుల్చుతుంది. సీజన్ మారినప్పుడు తినే ఆహార పదార్ధాలు కూడా సరిగ్గా ఉండేట్టు చూసుకోవాలి. ఆ వివరాలు మీ కోసం..
ప్రస్తుతం దేశంలో వర్షాకాలం నడుస్తోంది. ఎండల్నించి ఉపశమనం పొంది ఆహ్లాదాన్ని కల్గిస్తున్నా..ఆరోగ్యపరంగా మాత్రం చాలా అప్రమత్తత అవసరం. లేకపోతే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. వర్షాకాలంలో ఆహార పదార్ధాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన డైట్‌పై శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వర్షాకాలంలో పాల ఉత్పత్తులపై జాగ్రత్త అవసరం. లేకపోతే ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. వర్షాకాలంలో పాలు, పెరుగు పరిమితి మించి తీసుకోకూడదంటున్నారు.
వర్షాకాలంలో వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. ముఖ్యంగా క్రిమి కీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది. ఆవులు, గేదెలు, మేకలు ఆ క్రిమి కీటకాల్నే తింటుంటాయి. ఫలితంగా వాటి పాలు మనం తాగినప్పుడు అనారోగ్యం పాలయ్యే పరిస్థితులుంటాయి. అందుకే పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.
వర్షకాలంలో ఎక్కువగా జీర్ణక్రియ సమస్య వేధిస్తుంటుంది. ఫ్యాటీ మిల్క్ ఎక్కువగా తీసుకుంటే జీర్ణక్రియలో సమస్యలు ఎదురౌతాయి. దాంతో కడుపులో నొప్పి, గ్యాస్, అజీర్ణం, వాంతులు వంటి ఇబ్బందులు రావచ్చు. అందుకే వర్షాకాలంలో వీటికి దూరంగా ఉంటే మంచిది.
వేసవిలో సాధ్యమైనంతవరకూ ఎక్కువ మజ్జిగ లేదా పెరుగు తినమని సూచిస్తుంటారు. కానీ వర్షాకాలంలో మాత్రం సాధ్యమైనంత తక్కువ తీసుకోవాలి. వర్షాకాలంలో చలవ చేసే పదార్ధాలు తక్కువగా తీసుకుంటేనే మంచిది. లేకపోతే జలుబు, దగ్గు సమస్యలు తలెత్తుతాయి.
Also read: Unhealthy food Habits: గుండె పదిలంగా ఉండాలంటే..రక్త నాళికల ఆరోగ్యం అతి ముఖ్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook