Prabhas Says Theatres are Temples: జనాలు థియేటర్లకు రావడం మానేశారు అంటూ నిర్మాతలు సినిమా షూటింగులు ఆపేసి ఏం చేయాలా నిర్మాణ వ్యయం ఎలా తగ్గించాలా అని మల్ల గుల్లాలు పడుతుంటే ప్రభాస్ మాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రభాస్ ముఖ్య అతిథిగా సీతారామం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమాలో సుమంత్, రష్మిక కీలక పాత్రలలో నటించారు. స్వప్న సినిమాస్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద అశ్వినీదత్ సమర్పిస్తున్నారు. అయితే బింబిసార ఈవెంట్ కి హాజరైన ఒక అభిమాని మృతి చెందిన నేపథ్యంలో సీతారామం ఈవెంట్ కు కేవలం మీడియాను మాత్రమే అనుమతించారు నిర్వాహకులు. కేవలం చిత్ర బృందం ప్రభాస్ సహా మరికొద్దిమంది అతిధులు మాత్రమే ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ ఈ సినిమా ట్రైలర్ ముందే చూశానని చాలా బాగుందని అన్నారు.
ట్రైలర్ ఎవరు కట్ చేశారో తెలియదు కానీ చాలా అద్భుతంగా కట్ చేశారని పేర్కొన్న ఆయన దుల్కర్ సల్మాన్ ఒక మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అని మహానటి సినిమాలో ఆయన అద్భుతంగా నటించారమో అన్నారు. యుద్ధం ప్రేమ నేపథ్యంలో ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలు చేయాలంటే అనుకున్నంత ఈజీ అయితే కాదు కానీ దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాని ఒక కవిత్వం లాగా తెరకెక్కించారని అన్నారు. అయితే ఈ సినిమాలో సుమంత్ ఎలాంటి పాత్ర పోషించారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందని ప్రభాస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అశ్వినీదత్ తెలుగు సినీ పరిశ్రమలో ఉండడం మన అదృష్టం అని పేర్కొన్న ప్రభాస్ ఇది థియేటర్లోనే చూడాల్సిన సినిమా అని సినీ రంగంలో ఉన్న వారికి థియేటరే గుడి అని అన్నారు. అయితే అదంతా కూడా ప్రేక్షకులు ఇచ్చిందే అంటూ ప్రభాస్ చేపుకొచ్చారు. అయితే ఓటీటీలు వచ్చాయి కదా అని థియేటర్లను పక్కన పెట్టడం సరికాదు అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఇంట్లో పూజ గది ఉంది కదా అని గుడికి వెళ్లడం మానేస్తామా థియేటర్ కూడా అంతే అని చెప్పుకొచ్చారు.
Also Read: Uma Maheshwari Death: అందుకే ఆత్మహత్య.. లేఖ దొంగతనం కూడా.. సంచలన ఆరోపణలు చేసిన లక్ష్మీ పార్వతి
Also Read: Actor Chandan Kumar: తొందరపాటుకు తప్పదు మూల్యం.. సీరియల్స్ నుంచి లైఫ్ టైం బ్యాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook