Polluted Water: ఆరోగ్యం పట్ల ఎప్పుడూ అప్రమత్తత చాలా అవసరం. ముఖ్యంగా వర్షాకాలంలో. తినే ఆహారం, తాగే నీటి విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా..సమస్యలు కొనితెచ్చుకోవల్సిన పరిస్థితి. తాగే నీరు పరిశుభ్రంగా లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఆ వివరాలు మీ కోసం..
సీజన్ ఏదైనా తినే ఆహారం, తాగే నీరు ఎప్పుడూ పరిశుభ్రంగా, నాణ్యతగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ రెండింటి పట్ల మరింత జాగ్రత్త అవసరం. మెరుగైన ఆరోగ్యం కోసం రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగమని వైద్యులు సూచిస్తుంటారు. అదే సమయంలో తాగే నీరు ఎంతవరకూ పరిశుభ్రంగా ఉందో చెక్ చేసుకోవాలి. లేకపోతే కలుషితమైన నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అందుకే తాగే నీరు శుభ్రంగా ఉన్నాయో లేవో ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి. కలుషితమైన నీరు తాగితే కలిగే దుష్పరిణామాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగుతుందో చూద్దాం..
1. కలుషిత నీరు తాగడం వల్ల ముందుగా కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. జీర్ణక్రియను ప్రభావితం చేయడమే కాకుండా..వాంతులు, కడుపు నొప్పి వంటి ఇతర సమస్యలు ఏర్పడతాయి.
2. కలుషిత నీరు తాగడం వల్ల ఆ వ్యక్తి మెదడు పనితీరుపై కూడా నెగెటివ్ ప్రభావం పడుతుంది. పలు మానసిక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.
3. ముఖ్యంగా ఆ వ్యక్తికి డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. ఫలితంగా స్పృహ కోల్పోవడం, తల తిరగడం వంటి ఇబ్బందులు ఏర్పడతాయి.
4. కలుషిత నీరు తాగితే..కిడ్నీ సంబంధిత వ్యాధులు సంభవించే ప్రమాదముంది. కలుషిత నీరులో ఉండే కాడ్మియం కారణంగా..కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి.
Also read: Malaria Vaccine: త్వరలో మలేరియా వ్యాక్సిన్, అమెరికా క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook