CM JAGAN: టీడీపీని షేక్ చేస్తున్న సీఎం జగన్ ఢిల్లీ టూర్.. అక్కడ ఏం జరిగింది?

CM JAGAN: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి శని, ఆదివారాల్లో కీలక పరిణామాలు జరిగాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒకేసారి ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. కాని ఇద్దరు ఒకే సమావేశానికి మాత్రం హాజరు కాలేదు.

Written by - Srisailam | Last Updated : Aug 8, 2022, 05:01 PM IST
  • శనివారం చంద్రబాబుతో మోడీ ముచ్చట్లు
  • ఆదివారం జగన్ తో మోడీ లంచ్ మీటింగ్
  • చంద్రబాబు ప్రచారంపై వైసీపీ సెటైర్లు
 CM JAGAN: టీడీపీని షేక్ చేస్తున్న సీఎం జగన్ ఢిల్లీ టూర్.. అక్కడ ఏం జరిగింది?

CM JAGAN: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి శని, ఆదివారాల్లో కీలక పరిణామాలు జరిగాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒకేసారి ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. కాని ఇద్దరు ఒకే సమావేశానికి మాత్రం హాజరు కాలేదు. శనివారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలపై జరిగిన జాతీయ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నా సీఎం జగన్ దూరంగా ఉన్నారు. చంద్రబాబు వచ్చారు కాబట్టే జగన్ డుమ్మా కొట్టారనే ప్రచారం జరిగింది. ఆదివారం రాష్ట్రపతి భవన్ లో ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన సమావేశాల్లో జరిగిన పరిణామాలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. రాజకీయ రచ్చకు దారి తీశాయి.

శనివారం జరిగిన సమావేశంలో ప్రధాని మోడీతో పాటు వేదిక పంచుకున్నారు చంద్రబాబు. 2019 ఎన్నికల తర్వాత మోడీ, చంద్రబాబు కలిసింది ఇక్కడే. సమావేశం తర్వాత చంద్రబాబు దగ్గరకు వచ్చి కాసేపు మాట్లాడారు ప్రధాని మోడీ. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటికి వచ్చాయి.చంద్రబాబుతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా మాట్లాడారనే వార్తలు వచ్చాయి. ఇద్దరు కలిసి దాదాపు ఐదు నిమిషాలు మాట్లాడుకున్నారని తెలిసింది. మోడీతో చంద్రబాబు మాట్లాడిన వీడియోను టీడీపీ వర్గాలు వైరల్ చేశాయి. దీంతో ఏపీలో టీడీపీ, బీజేపీ మళ్లీ పొత్తు పెట్టుకోనున్నాయనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఏపీలో కొన్ని రోజులుగా పొత్తుల రాజకీయాలు సాగుతున్నాయి. 2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడుతాయనే వార్తలు వచ్చాయి. అయితే పొత్తులపై బీజేపీ హైకమాండ్ నుంచి క్లారిటీ రాలేదు. ఢిల్లీలో చంద్రబాబుతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా మాట్లాటడంతో,,  బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కుదరనుందని.. వైసీపీ పని అయిపోయినట్టేననే ప్రచారం కొన్ని వర్గాలు చేశాయి. టీడీపీ నేతలు సెలబ్రేట్ చేసుకున్నాయి. అయితే తమ్ముళ్లకు ఆనందం ఎంతో సేవు నిలవలేదు. కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది. తెలుగుదేశం పార్టీకి దిమ్మతిరిగే పరిణామం జరిగింది.

ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో ఏపీ సీఎం జగన్ తో సరదాగా మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ. అంతేకాదు సీఎం జగన్ తో కలిసి లంచ్ చేశారు. ప్రధాని మోడీతో పాటు సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రులంతా కలిసి మధ్యాహ్నం లంచ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటికి వచ్చాయి. ప్రధాని నేరంద్ర మోడీ, ఏపీ సీఎం కలిసి ఒకే టేబుల్ పై భోజనం చేశారు. దాదాపు గంట సేపు వాళ్లు ఆ టేబుల్ దగ్గరే కూర్చున్నారు. ప్రధాని మోడీతో కలిసి లంచ్ చేసిన వారిలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు రాజస్థాన్‌ సీఎం గెహ్లాట్, అసోం సీఎం హిమంత్‌బిశ్వాస్‌ శర్మ, ఇద్దరు లెఫ్టినెంట్‌ గవర్నర్లు ఉన్నారు. ప్రధాని మోడీతో కలిసి సీఎం జగన్ లంచ్ చేసిన వీడియో ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. తెలుగుదేశం పార్టీలో గుబులు రేపింది. వైసీపీ కేడర్ లో జోష్ నింపింది.

ప్రధాని మోడీ, సీఎం జగన్ లంచ్ ఫోటోలను వైరల్ చేస్తూ టీడీపీని, చంద్రబాబును ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. సమావేశంలో తనకు ఎదురుపడిన చంద్రబాబుతో ప్రధాని మోడీ కరచాలనం చేసినందుకే సంబరాలు చేసుకున్న తమ్ముళ్లు ఈ ఫోటోలను చూసి తట్టుకోగలరా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. రాజకీయంగా ఎంత బద్ద శత్రువులైనా పరస్పరం ఎదురుపడినప్పుడు పరస్పరం విష్ చేసుకుంటారని.. యోగక్షేమాలు తెలుసుకుంటారని.. దానికే ఏదో జరిగిపోయిందంటూ సంబరాలు చేసుకుంటారా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సమావేశం అంటే ఇలా కూర్చుని మాట్లాడుకుంటారు.. అలా నిలబడి మాట్లాడుకోరూ అంటూ మోడీ, జగన్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నదాన్ని లేనట్టుగా.. లేనిది ఉన్నట్లుగా అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని కొందరు వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతలకు హితవు పలికారు. 

ఇక  ప్రధాని మోడీతో కలిసి సీఎం జగన్ దాదాపు గంట సేపు లంచ్ మీటింగ్ నిర్వహించారనే వార్తలు తెలుగుదేశం పార్టీలో గుబులు రేపుతున్నాయని తెలుస్తోంది. నిజానికి శనివారం సమావేశం తర్వాత చంద్రబాబుతోనే కాదు తనపై నిత్యం నిప్పులు చెరిగే జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరితోనూ సరదాగా మాట్లాడారు.మోడీ,చంద్రబాబు కలిసిన ఫోటోకు తాము అంతగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం కొందరు టీడీపీ నేతల నుంచి వస్తోంది.మొత్తంగా శని, ఆదివారాల్లో ఢిల్లీలో జరిగిన పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాక రాజేయగా.. ప్రధాని, సీఎం లంచ్ మీటింగ్ తో టీడీపీ కేడర్ నిరుత్సాహానికి గురైందని తెలుస్తోంది. 

Also Read: Pitru Paksha: పెద్దల అమావాస్య ఎప్పుడొస్తోంది.. పితృ దోష విముక్తికి ఏం చేయాలి.. ఈ 15 రోజులు చేయకూడని పనులేంటి..

Also Read: KomatiReddy Rajgopal Reddy Live Updates: ఇవాళ స్పీకర్ కు కోమటిరెడ్డి రాజీనామా.. ఉప ఎన్నిక డేట్ ఫిక్స్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News