International Youth Day 2022: ఇవాళ అంతర్జాతీయ యువజన దినోత్సవం. ప్రతీ ఏటా ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ యూత్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. యువతకు సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారాలపై అవగాహన కల్పించడం, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, పర్యావరణ తదితర అంశాల్లో యువత పాత్రను, ప్రాధాన్యతను తెలియజెప్పడం దీని ముఖ్య ఉద్దేశం. అసలు ఇంటర్నేషనల్ యూత్ డే చరిత్ర ఏంటి.. ఈసారి దాని థీమ్ ఏంటి.. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
ఈసారి థీమ్ ఇదే :
యునైడెట్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ రిపోర్ట్ ప్రకారం ఈసారి ఇంటర్నేషనల్ యూత్ డేకి 'తరాల మధ్య సంఘీభావం.. అన్ని వయస్కుల వారికి అనువైన ప్రపంచం' అనే థీమ్‌ని ఎంచుకున్నారు. సమాజంలో తరాల మధ్య అంతరాన్ని తగ్గించడం, వయోభార సమస్యలకు పరిష్కార మార్గాలే లక్ష్యంగా ఈ థీమ్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువత జ్ఞానాన్ని, పెద్దల ఆదర్శవాదాన్ని స్వాగతిస్తూ అన్ని వయస్కుల వారు సమానంగా ముందుకు సాగే ఒక మంచి ప్రపంచానికి బాటలు వేయడం కోసం ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇంటర్నేషనల్ యూత్ డే చరిత్ర :
ఆస్ట్రియాలోని వియన్నాలో 1991లో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన మొట్టమొదటి సెషన్‌కి హాజరైన యువత ఇంటర్నేషనల్ యూత్ డే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఐక్యరాజ్య సమితికి నిధుల సమీకరణలో సాయపడేందుకు ఈ ప్రతిపాదన చేశారు. 1998లో లిస్బన్‌లో జరిగిన వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ మినిస్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ యూత్ ఫస్ట్ సెషన్‌లో ఆగస్టు 12వ తేదీని ఇంటర్నేషనల్ యూత్ డేగా అధికారికంగా ప్రకటించారు. ఆ మరుసటి సంవత్సరం ఐరాస దీన్ని అధికారికంగా ఆమోదించింది.ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి ఇంటర్నేషనల్ యూత్ డేని ఆగస్టు 12, 2000న నిర్వహించింది.
ఇంటర్నేషనల్ యూత్ డే విషెస్, కొటేషన్స్, మెసేజెస్ :
యవ్వనంలో ఏర్పడే మంచి అలవాట్లు వారి జీవితాన్ని మార్చివేస్తాయి-అరిస్టాటిల్
యువత శక్తి ఈ ప్రపంచానికి ఉమ్మడి ఆస్తి వంటిది. యువకులే ఈ ప్రపంచానికి భూత, వర్తమాన, భవిష్యత్. సమాజంలోని ఏ రంగం యువత శక్తికి, వారిలోని ఆసక్తి, ఉత్సాహానికి, ధైర్యానికి, ఆదర్శవాదానికి సరితూగదు.-కైలాష్ సత్యార్థి
యువతపై నా నమ్మకం.. ఏ సమస్య పరిష్కారానికైనా వారు సింహాల్లా పనిచేస్తారు-స్వామి వివేకానంద
యువతకు వివేకం తక్కువ. అందుకే వారు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ప్రయత్నం చేస్తారు-పెరల్ ఎస్ బక్
యవ్వనం ఒక కల. అది కెమికల్ మ్యాడ్‌నెస్‌కి ఒక రూపం - స్కాట్ ఫిట్జ్‌గెరాల్డ్
Also Read: KCR NATIONAL POLITICS: బీహార్ నుంచి నరుక్కొస్తున్న కేసీఆర్.. రేపు నితీశ్, తేజస్వీతో చర్చలు!
Also Read: Sun Transit 2022: సింహ రాశిలోకి సూర్యుడు.. ఆగస్టు 17 నుంచి కన్యా రాశి వారు జాగ్రత్తగా ఉండాలి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook