MLA Warning: ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు గౌరవప్రదంగా ఉండాలి. ప్రజలకు ఆదర్శంగా నిలవాలి. ఎవరైనా తప్పు చేస్తే సరిదిద్దాలి. గొడవలు, అల్లర్ల సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాని ఆ ప్రజా ప్రతినిధే రెచ్చిపోతే.. కార్యకర్తలను రెచ్చగొడితే.. పరిస్థితి ఏంటీ.. కాని ఓ ఎమ్మెల్యే ఇలానే వ్యవహరించారు. తన కార్యకర్తలను రెచ్చగొట్టారు. ప్రత్యర్థి వర్గ కార్యకర్తలపై దాడులు చేయాలని బహిరంగంగా ఉసిగొల్పాడు. మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
మహారాష్ట్రంలో ఇటీవలే కొత్త సర్కార్ ఏర్పడింది. శివసేనను చీల్చిన ఏక్ నాథ్ షిండే.. బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు.శివసేనకు చెందిన మెజార్టీ ఎమ్మెల్యే షిండేకు మద్దతుగా నిలిచారు. ఈ ఘటన తర్వాత రాష్ట్రంలో శివసేన, షిండే వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇరు వర్గాల కార్యకర్తలు గొడవవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ సుర్వే రెచ్చగొట్టే కామెంట్లు చేశారు. శివసేన కార్యకర్తలపై తన అనుచరులను దాడికి ఉసిగొల్పారు.‘దాడులు చేయండి, చితకబాదండి, కాళ్లు విరగ్గొట్టండి..’ అంటూ ఓపెన్ గానే వ్యాఖ్యానించారు.
కాళ్లు విరగొట్టి రండి.. కేసులు ఎదురైతే నేను చూసుకుంటా.. తర్వాతి రోజే బెయిల్‌పై బయటకు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. షిండే వర్గ ప్రకాశ్ సుర్వే చేసిన ఈ కామెంట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అధికారంలో ఉన్నామన్న సంతృప్తి వద్దు. వారి స్థానమేంటో వారికి చూపించాలి. మనల్ని విమర్శిస్తే సహించేది లేదు. ఎవరైనా ఏమైనా అంటే చితకబాదండి.. ఇక్కడ ప్రకాశ్ సుర్వే కూర్చొని ఉన్నాడు.. వారికి పిప్పిపిప్పి చేయండి’ అని మ్మెల్యే మాట్లాడినట్టు ఆ వీడియోలో ఉంది. ఎమ్మెల్యేపై ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. వైరల్ గా మారిన తన వీడియోపై స్పందించేందుకు నిరాకరించారు ఎమ్మెల్యే ప్రకాశ్ సుర్వే.
Read also: Nashik Earthquake: మహారాష్ట్ర నాసిక్‌లో భూకంపం.. గంట వ్యవధిలో మూడుసార్లు...
Read also: Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్ కేసులో ట్విస్ట్.. న్యూడ్ వీడియోపై సీబీఐ విచారణ? వైసీపీలో కలవరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook