Kalashtami Vratam 2022: ఇవాళే కాలాష్టమి వ్రతం.. కాల భైరవుడిని ఇలా పూజించండి!

Kalashtami Vrat 2022:  ఈరోజు కాలాష్టమి వ్రతం. తంత్ర మంత్రాలకు దేవుడు కాలభైరవుడు. కాలాష్టమి వ్రతం యొక్క శుభ సమయం, పూజా విధానం గురించి తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 19, 2022, 09:18 AM IST
Kalashtami Vratam 2022: ఇవాళే కాలాష్టమి వ్రతం.. కాల భైరవుడిని ఇలా పూజించండి!

Kalashtami Vratam 2022: ప్రతి నెల కృష్ణ పక్షంలోని అష్టమి తిథి నాడు కాలాష్టమి వ్రతం జరుపుకుంటారు. ప్రస్తుతం భాద్రపద మాసంలోని కాలాష్టమి వ్రతం (Kalashtami Vratam 2022) ఈ రోజు అంటే ఆగస్టు 19న జరుపుకోనున్నారు. ఈ రోజున శివుడి రుద్రావతారమైన కాల భైరవుడిని పూజిస్తారు. తంత్ర సాధన చేసేవారు ఈ రోజు రాత్రి కాల భైరవుడిని పూజించి మంత్రాల సిద్ధి కోసం ప్రార్థనలు చేస్తారు. రోగాలు, గ్రహ దోషాలతో బాధపడేవారు ఈ దేవుడిని ఆరాధిస్తారు. కాలభైరవుడు అన్ని రకాల దుఃఖాలను మరియు దోషాలను తొలగిస్తాడు. కాలాష్టమి వ్రతానికి సంబంధించిన శుభ సమయం మరియు పూజా విధానం గురించి తెలుసుకుందాం. 

కాలాష్టమి వ్రతం 2022 ముహూర్తం
పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలోని కృష్ణ పక్షంలోని అష్టమి తిథి ఆగస్టు 18వ తేదీ రాత్రి 09:20 గంటలకు ప్రారంభమై... ఆగస్టు 19వ తేదీ రాత్రి 10:59 వరకు ఉంటుంది. ఉదయతిథి ఆధారంగా, భాద్రపద మాస కాలాష్టమి వ్రతం ఆగస్టు 19వ తేదీన నిర్వహించనున్నారు. ఈ రోజు ఉదయం నుండే ధృవయోగం కూడా ఉంది. ఇది రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఈ రోజు అభిజిత్ లేదా శుభ ముహూర్తం ఉదయం 11.58 నుండి మధ్యాహ్నం 12.51 వరకు ఉంటుంది.

కాలాష్టమి పూజా విధానం
కాలాష్టమి రోజున ఉదయం స్నానం చేసి.. మంచి బట్టలు ధరించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట బాబా కాలభైరవుడిని ఆరాధిస్తారు. వీలైతే కాలభైరవుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించి పూజలు చేయండి.  అక్షత, తమలపాకులు, కొబ్బరికాయ, పూలతో బాబా కాల భైరవుని పూజించండి. తర్వాత కాల భైరవ చాలీసా, కాల భైరవష్టకం పఠించండి. వీలైతే కాల భైరవ మంత్రాలను కూడా జపించవచ్చు. కాలభైరవుడిని పూజించిన తరువాత కుక్కకు పాలు మరియు రొట్టెను  తినిపించండి. ఈ రోజు కుక్కను చంపితే కాలభైరవుడికి కోపం వస్తుందనే విషయాన్ని గుర్తించుకోండి. 

Also Read: Shri Krishna in Dream: శ్రీకృష్ణుడు కలలో కనిపిస్తే.. మీ లైఫ్ ఎలా మారిపోతుందో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News