Russia vs Ukraine: రష్యా, ఉక్రెయిన్ వార్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా మిస్సైల్ దాడి చేసింది. ఇందులో 22 మంది మృతి చెందారు. ఈవిషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత డోనెట్స్క్కు పశ్చిమ వైపు 145 కిలోమీటర్ల దూరంలోని చాప్లిన్ రైల్వే స్టేషన్‌పై రాకెట్ దాడులు జరిగాయి. ఘటనలో నాలుగు రైల్వే క్యారేజీలు అగ్నికి ఆహుతైయ్యాయి.
అక్కడికక్కడే 22 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈఘటనను వివరించారు. రష్యా ఎన్ని దాడులు చేసినా వెనక్కి తగ్గబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాతోపాటు ఇతర ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర పోరు జరుగుతోంది.
ఇరు దేశాలు నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ కీలక ప్రాంతాలు నేలమట్టం అయ్యాయి. ఐనా ఆ దేశం ప్రతిఘటిస్తోంది. రష్యా సైనిక చర్యల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్తోపాత్, ఖార్కీవ్ పూర్తిగా దెబ్బతింది. ఖార్కీవ్లో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా నేటమట్టం అయిన భవనాలు కనిపిస్తున్నాయి. మరియోపోల్, సుమీ, ఎల్వీవ్ నగరాలపై మిస్సైళ్లతో రష్యా దాడి కొనసాగిస్తోంది.
గత ఆరు నెలల నుంచి ఇరుదేశాల మధ్య యుద్దం జరుగుతోంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించింది. అప్పటి నుంచి ఉక్రెయిన్‌లోకి రష్యా సైనికులు చొచ్చుకువస్తున్నాయి. ఇప్పటికే కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. ఉక్రెయిన్‌లో ఉన్న వ్యతిరేక శక్తులను ఖతం చేయడమే తమ లక్ష్యమని..ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. అందుకే ఏరివేత కొనసాగిస్తున్నామని తేల్చి చెప్పారు.
ఐతే ఉక్రెయిన్ మాత్రం రష్యా తీరును ఖండిస్తోంది. తమ దేశాన్ని ఆక్రమించుకునేందుకే రష్యా ఇలా చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. మొత్తంగా 1991లో సోవియట్ యూనియన్ పతనం అనంతరం ఉక్రెయిన్ ఏర్పడింది. ఆగస్టు నెలలో స్వాతంత్ర్య వేడుకలు జరుగుతున్నాయి. నాటో సైనిక కూటమిలో చేరేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోంది. ఈక్రమంలో ఆ దేశంపై రష్యా యుద్ధం ప్రకటించింది. ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు అమెరికా 13.5 బిలియన్ డాలర్ల సైనిక, ఆయుధ సహాయాన్ని అందించింది.
Also read:Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి, 14 మందికి గాయాలు
Also read:Corona Updates in India: దేశంలో కలవర పెడుతున్న యాక్టివ్ కేసులు..తాజా లెక్కలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి