Papaya benefits: బొప్పాయి వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇది శరీరానికి దివ్యౌషధమనే చెప్పాలి. బొప్పాయిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా బొప్పాయి తొక్కలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. దీనిని పేస్ మాస్క్ వేసుకోవచ్చు. జీర్ణక్రియ సరిగ్గా ఉంచడంలో బొప్పాయి (Papaya benefits) అద్భుతంగా పనిచేస్తుంది. బొప్పాయి ఆకుల రసం తాగితే ఎర్రరక్తకణాల సంఖ్య పెరుగుతుంది.
మన శరీరానికి రోజూ అధిక మెుత్తంలో ప్రోటీన్, ఫైబర్, పిండి పదార్థాలు, ఖనిజాలు అవసరం. బొప్పాయిలో విటమిన్ బి, ఇ, సి మరియు బి9 సమృద్ధిగా ఉంటాయి. దీంతోపాటు ఇందులో ఫైటోకెమికల్స్, కెరోటినాయిడ్స్ మరియు ఇతర యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. అంతేకాకుండా బొప్పాయిలో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ మరియు మాంగనీస్ వంటి ఖనిజాలు అధిక మెుత్తంలో ఉంటాయి. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
బొప్పాయి ప్రయోజనాలు
>> బొప్పాయిని రోజూ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
>> రక్త ప్రసరణను బ్యాలెన్స్ చేయడంలో సూపర్ గా పనిచేస్తుంది.
>> బొప్పాయిని అధిక మెుత్తంలో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
>> ఇన్ఫెక్షన్లు, జలుబు, ప్లూ వంటి వ్యాధులకు రాకుండా ఉండాలంటే బొప్పాయిని తీసుకోవాలి.
>> శ్వాసకోశ సమస్యల, తలనొప్పిని తగ్గించడంలో బొప్పాయి అద్భుతంగా పనిచేస్తుంది.
Also Read: Diabetic Diet Tips: డయాబెటిస్ రోగులు ఏ పండ్లు తినవచ్చు, ఏవి తినకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook