Drinking Water During Meals: భోజనం చేసేటప్పుడు కొంతమంది నీళ్లు ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఇది మంచి అలవాటేనా.. దీనివల్ల ఏమైనా సమస్యలు తలెత్తుతాయా అంటే.. అవుననే చెబుతున్నారు నిపుణులు. భోజనం చేసేటప్పుడు కొద్దిగా నీళ్లు తాగడం మంచిదే కానీ.. గ్లాసుల కొద్ది వాటర్ తాగడం మంచిది కాదంటున్నారు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియపై దుష్ప్రభావం పడుతుందని చెబుతున్నారు.
భోజనం చేసేటప్పుడు నీళ్లు అతిగా తాగితే ఏమవుతుంది :
మనం తినే ఆహారం జీర్ణాశయంలోకి వెళ్తుంది. జీర్ణాశయంలో ఆ ఆహారం జీర్ణమయ్యేందుకు అవసరమయ్యే ఎంజైమ్స్ విడుదలవుతాయి. ఒకవేళ భోజనం సమయంలో నీరు ఎక్కువగా తాగినట్లయితే ఆ ఎంజైమ్స్ పలుచబడిపోతాయి. అప్పుడు జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కడుపు ఉబ్బడం, బరువు పెరగడం వంటి సమస్యలు రావొచ్చు.
గోరు వెచ్చని నీళ్లు తాగితే మంచిది :
భోజనానికి రెండు గంటల ముందు, భోజనానికి అరగంట తర్వాత నీళ్లు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. భోజన సమయంలో కొద్ది కొద్దిగా నీటిని సిప్ చేయొచ్చు గానీ గ్లాసులకు గ్లాసులు తాగవద్దని సూచిస్తున్నారు. అలాగే, భోజనం సమయంలో గోరు వెచ్చని నీరు తాగడం మరింత మంచిదని చెబుతున్నారు.
అపోహ మాత్రమేనా..?
భోజనం సమయంలో నీరు తాగొద్దనేది అపోహ మాత్రమే అనేవారు లేకపోలేదు. అయితే భోజనం సమయంలో ఎక్కువ నీరు తీసుకోకుండా కొద్ది కొద్దిగా నీటిని సిప్ చేస్తే ఏ సమస్య ఉండదంటున్నారు. కాబట్టి జీర్ణ వ్యవస్థ బాగుండాలంటే భోజనం సమయంలో అతిగా నీరు తాగొద్దు. అయితే భోజనం తర్వాత అరగంటకు సరిపడా నీళ్లు తాగాలి. తద్వారా భోజనం సరిగా జీర్ణమవుతుంది. మలబద్దకం లాంటి సమస్యలు తలెత్తవు.
(గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ తెలుగు న్యూస్ దీన్ని ధ్రువీకరించలేదు. సలహాలు పాటించే ముందు వైద్యుడిని సంప్రదించండి.)
Also Read: చివరి ఓవర్లో సూర్యకుమార్ వీరవిహారం.. వైరల్‌గా మారిన విరాట్ కోహ్లీ రియాక్షన్!
Also Read: King Cobra Video: ఆ కారు యజమానికి దడ పుట్టించిన కింగ్ కోబ్రా.. వారం రోజులకు పైగా వాహనంలోనే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook