Die hard Fan Movie Telugu Review: శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై శివ ఆలపాటి, ప్రియాంక శర్మ, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నోయల్ కీలక పాత్రలలో నటించిన తాజా చిత్రం డై హార్డ్ ఫ్యాన్. అభిరామ్ దర్శకత్వంలో చంద్ర ప్రియ సుబుద్ధి నిర్మించిన ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక శర్మ ఆమెకి డైహర్ట్ ఫ్యాన్ గా శివ ఆలపాటి నటించారు. మధు పొన్నాస్ సంగీతం అందించిన ఈ సినిమాకు ఆరెక్స్ 100 ఫేమ్ సయ్యద్ తాజుద్దీన్ మాటలు అందించారు. ఈ సినిమా నుండి విడుదలైన పాటలు అలాగే ప్రమోషనల్ స్టఫ్ కారణంగా సినిమాపై ఆసక్తి రేకెత్తింది. మరి శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.
డై హార్డ్ ఫ్యాన్ కథ:
మామూలుగానే సినిమా వాళ్ళు అంటే జనాల్లో భీభత్సమైన క్రేజ్ ఉంటుంది. మరీ ముఖ్యంగా హీరో హీరోయిన్లు అంటే కోసుకోవడానికి రెడీ అయిపోతూ ఉంటారు. అలాగే శివ (శివ ఆలపాటి) ఒక హీరోయిన్ ను ఆరాధిస్తూ ఉంటాడు. ఎప్పటికైనా తాను అభిమానించే హీరోయిన్(ప్రియాంక శర్మ )ను కలవాలనుకుంటాడు. అయితే ఒక సెలబ్రిటీగా ఆమె ఈ ఫంక్షన్ కు వెళ్లినా అక్కడికి మిస్ అవకుండా వెళ్ళేవాడు. అయితే ఆమె బర్త్ డే రోజు ఎంతో గ్రాండ్ గా తన అభిమానాన్ని చూపిద్దామని వెయిట్ చేస్తున్న శివకు ఆమె బర్త్ డే రోజునే ఆమె నుంచి మెసేజ్ రావడంతో షాక్ కు గురవుతాడు. శివ షాక్ లో ఉండగానే ప్రియాంక డైరెక్ట్ గా శివ ఫ్లాట్ కు వచ్చి మరింత షాకిస్తుంది. అసలు రాత్రి సమయంలో ఒక స్టార్ హీరోయిన్ ప్రియాంక శర్మ డై హార్డ్ ఫ్యాన్ శివ ఇంటికి రావడానికి కారణం ఏంటి?, ఆ రాత్రి వారి మధ్య ఏం జరిగింది? అసలు ఆ రాత్రి జరిగిన సంఘటన నుండి శివ ఎలా బయట పడ్డాడు? అనేది తెలుసు కోవాలంటే థియేటర్ కి వెళ్లి డై హార్డ్ ఫ్యాన్ సినిమా చూడాల్సిందే?
నటీనటుల పనితీరు
సెలబ్రిటీ క్యారెక్టర్ లో ప్రియాంక శర్మ ఒదిగిపోయింది. ఆమె నటిస్తుందా? లేక నిజ జీవిత పాత్రలో జీవిస్తుందా అన్నట్టుగా ఆమె తన నటనతో తనదైన ఎక్స్ ప్రెషన్స్ తో మెప్పించింది. ఇక ఒక హీరోయిన్ కు వీరాభిమానిగా శివ ఆలపాటి చాలా ఈజ్ తో నటించాడు. ఇక పొలిటిషియన్ ‘బేబమ్మ’గా నటించిన షకలక శంకర్ కామెడీ సినిమాకు హైలెట్. కృష్ణ కాంత్ పాత్రలో రాజీవ్ కనకాల, పోలీస్ ఆఫీసర్ గా నోయల్ కూడా తమ సత్తా మరోసారి చాటారు. ఇక కేశవ్ దీపక్, రవి వర్మ,ఆలపాటి లక్ష్మి, అప్పారావు సహా మిగతా నటీనటులు అందరూ తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ టీమ్
టెక్నికల్ టీమ్ పని తీరు విషయానికి వస్తే మంచి కంటెంట్ తో కామెడీ మిస్ అవకుండా సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ప్రతి పది నిమిషాలకు ఒకసారి థ్రిల్ కలిగేలా చేస్తూ బాగా స్క్రిప్ట్ రాసుకున్నాడు దర్శకుడు దర్శకుడు అభిరామ్. తాజుద్దీన్ సంభాషణలు ఆకట్టుకున్నాయి. కథ, కథనం సెట్ అవడంతో పాటు సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా స్పెషల్ హైలైట్. ఇక జగదీష్ బొమ్మిశెట్టి సినిమాటోగ్రఫీ ఈ మరో హైలెట్. ఎడిటింగ్ కూడా ఎక్కఫా వంక పెట్టలేని విధంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టు ఉన్నాయి.
ఫైనల్ గా
ఫ్యామిలీతో కలిసి చూడగలిగే విధంగా ఈ సినిమా ఉంది. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి ఖచ్చితంగా నచ్చే సినిమా ఇది.
Also Read: Chandrababu Wishes to Pawan Kalyan: బాబుకు ఎన్టీఆర్ కంటే పవనే ఎక్కువయ్యారా?
నటీనటులు: శివ ఆలపాటి, ప్రియాంక శర్మ, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నోయల్ తదితరులు
దర్శకుడు: అభిరామ్
నిర్మాత: చంద్ర ప్రియ సుబుద్ది
మాటలు: సయ్యద్ తాజుద్దీన్
సంగీతం: మధు పొన్నాస్
సినిమాటోగ్రఫీ: జగదీష్ బొమ్మిశెట్టి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి