Bandla Ganesh vs Jr NTR: బండ్ల గణేష్-ఎన్టీఆర్ మధ్య అసలు వివాదం ఏమిటో తెలుసా?

Disupute Between Bandla Ganesh and Jr NTR:  ఎన్టీఆర్ బండ్ల గణేష్ మధ్య గతంలో ఒక వివాదం నడిచిన నేపథ్యంలో ఆ వివాదానికి కారణం ఏమిటి? అనే అంశం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 3, 2022, 09:24 PM IST
Bandla Ganesh vs Jr NTR: బండ్ల గణేష్-ఎన్టీఆర్ మధ్య అసలు వివాదం ఏమిటో తెలుసా?

Disupute Between Bandla Ganesh and Jr NTR: బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎక్కడ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకుండా ఆయన సీఎం కేసీఆర్ టైగర్ అని అర్థం వచ్చేలా ట్వీట్ చేసినా సరే ఎన్టీఆర్ ని టార్గెట్ చేసి బండ్ల గణేష్ ట్వీట్ చేశాడంటూ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఇతర హీరోల అభిమానులు కూడా ఈ పద్ధతి కరెక్ట్ కాదని బండ్ల గణేష్ కు క్లాస్ పీకుతున్నారు.

అయితే ఎన్టీఆర్ బండ్ల గణేష్ మధ్య గతంలో ఒక వివాదం నడిచిన నేపథ్యంలో ఇది ఎన్టీఆర్ ను ఉద్దేశించి బండ్ల గణేష్ చేసిన ట్వీట్ అని చాలా మంది నమ్ముతున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఒకప్పుడు ఏర్పడిన సమస్య ఏమిటి? ఆ వివాదానికి కారణం ఏమిటి? అనే అంశం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి శ్రీను వైట్ల డైరెక్టర్గా ఎన్టీఆర్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బాద్షా అనే సినిమా బండ్ల గణేష్ నిర్మించారు. ఈ సినిమాకు పెట్టిన డబ్బులు వెనక్కి రాలేదని తాను నష్టపోయానని బండ్ల గణేష్ చెబుతూ ఉంటారు.

తర్వాత కొన్ని ఏళ్ల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో మళ్ళీ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా టెంపర్ అనే సినిమా చేశారు. ఈ సినిమా మాత్రం సూపర్ హిట్గా నిలిచింది. అప్పటివరకు వరుస ప్లాపులు అందుకుంటున్న పూరి జగన్నాథ్, ఎన్టీఆర్  సహా బండ్ల గణేష్ కి కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. అయితే బండ్ల గణేష్ ఈ సినిమా తర్వాత సినిమాలు చేయడం ఆపేశారు. ఎందుకు గ్యాప్ వచ్చిందో తెలియదు కానీ తర్వాత నిర్మాతగా ఆయన సైలెంట్ అయిపోయారు.

రాజకీయాల్లో యాక్టివ్ అయిన తర్వాత ఒక టీవీ ఛానల్ లో మాట్లాడుతూ తనకు ఎన్టీఆర్ కు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే విభేదాలు ఏమిటి అనే విషయం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఎన్టీఆర్ కు బండ్ల గణేష్ కు మధ్య ఏదో జరిగిపోయింది అంటూ రకరకాల ప్రచారాలు అయితే జరిగాయి. రకరకాల కథనాలు కూడా పుట్టుకొచ్చాయి అయితే ఆ తర్వాత అసలు ఇద్దరి మధ్య ఏర్పడిన వివాదం ఏమిటి అనే విషయం మీద బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు.

టెంపర్ సినిమా తరువాత కొంతమంది చెప్పుడు మాటలు విని తాను ఎన్టీఆర్ను తప్పుగా అర్థం చేసుకున్నానని, ఆయనతో దానికి విభేదాలు ఉన్నాయని చెప్పి ఇంటికి వెళ్లిన తర్వాత తన తండ్రి కూడా బాధపడ్డారని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. అయితే తమ మధ్య అసలు ఎలాంటి విభేదాలు లేవని ఉన్నవి కేవలం మనస్పర్ధలేనని ఆయన క్లారిటీ ఇచ్చారు. అన్యోన్యంగా ఉండే భార్యాభర్తలు అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి, మా మధ్య రావడం పెద్ద విషయం ఏమీ కాదంటూనే ఇప్పుడు బాగానే ఉన్నామని కలిసి పోయామని కూడా ఆయన అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. అయితే అంతా బాగానే ఉందనుకుంటే ఇలా ఎన్టీఆర్ ను టార్గెట్ ఎందుకు చేసి ఇలా ట్వీట్ చేశారనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.

Also Read: Hero Nani Adopted Puppy: వీధి కుక్కపిల్లను దత్తత తీసుకున్న హీరో నాని

Also Read: Bandla Ganesh Targets Jr NTR: కేసీఆర్ టైగర్ అంటూ బండ్ల కామెంట్స్.. ఆడుకుంటున్న ఎన్టీఆర్ ఫాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News